అయ్యయ్యో..భారత్‌లోనే ఇరుక్కుపోయిన కెనడా ప్రధాని
X
విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో జీ 20 శిఖరాగ్ర సమావేశాలకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌లోనే చిక్కుకుపోయారు. విమానం రిపేర్‌కు సమయం పడుతుండటంతో గత మూడు రోజులుగా జస్టిన్ ట్రూడో ఇండియాలోనే ఉంటున్నారు. జీ 20 సదస్సు ముగిసినా విమానం మొరాయించడంతో స్వదేశానికి చేరుకోలేకపోయారు. ఇవాళ విమానం రిపేర్‌కు అవసరమయ్యే విడి భాగాలతో పాటూ మరో విమానం భారత్‌కు రానున్నట్లు కెనడా వర్గాలు తెలిపాయి. దీంతో మధ్యాహ్నం లేదా సాయంత్రం కెనడా ప్రధాని తమ దేశానికి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇండియా వచ్చి మూడు రోజులు అవుతుండటంతో తమ ప్రధానికి వీలైనంత త్వరగా కెనడాకు తీసుకెళ్లేంుదకు కెనెడా మిలిటరీ ప్రయత్నిస్తున్నట్లు తాజాగా ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
గతంలో భారత పర్యటనలోనూ కెనడా ప్రధానికి ఇక్కట్లు తప్పలేదు. ఓ విందులో భారత వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టే ఓ వ్యక్తి గెస్ట్‌గా రావడంతో ప్రధానికి దౌత్యపరమైన చిక్కులు ఎదురయ్యాయి. దీంతో ఈ ఏడు జరిగిన జీ20 సమ్మిట్ లో ఇండియా కెనడా విషయంలో కాస్త కఠినంగానే ఉంది. కెనడాతో ఇండియా గవర్నమెంట్ ఎలాంటి అఫీషియల్ మీటింగ్‌ను నిర్వహించలేదు. కెనడా ప్రధాని ట్రూడోతో భారత ప్రధాని మోదీ పర్సనల్‌గా మాట్లాడి, కెనడా వేదికగా జరిగే భారత వ్యతిరేక కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేశారని ఫారెన్ అఫైర్స్ మినిస్టీ ఓ ప్రకటనలో తెలిపింది.