Home > అంతర్జాతీయం > Justin Trudeau : క్షమాపణలు చెప్పిన కెనడా ప్రధాని.. ఘోర అపరాధం చేశాను..

Justin Trudeau : క్షమాపణలు చెప్పిన కెనడా ప్రధాని.. ఘోర అపరాధం చేశాను..

Justin Trudeau  : క్షమాపణలు చెప్పిన కెనడా ప్రధాని.. ఘోర అపరాధం చేశాను..
X

ఓ సిక్కు ఉగ్రవాది హత్య వెనక భారత ప్రభుత్వ హస్తం ఉందంటూ హల్‌చల్ చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరో వివాదంలో చిక్కుకున్నారు. కక్కలేక మింగలేక ‘‘ఘోరం తప్పిదం చేశాను, అందుకు సారీ’’ అని ఉక్రెయిన్‌కు క్షమాపణ చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధంలో యూదులను ఊచకోత కోసిన ఓ నాజీ సైనికున్ని కెనడా పార్లమెంటుకు ఆహ్వానించి సత్కరించి తప్పు చేశానని ట్రూడో బహిరంగ ప్రకటన చేశారు.

ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లదిమీర్ జెలెన్‌స్కీ కెనడాకు వచ్చిన సందర్భంగా పార్లమెంటులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కెనడాలో స్థిరపడిన యారోస్లావ్ హుంకా అనే 98 ఏళ్ల ఉక్రెయిన్ మాజీ నాజ సైనికుడిని కూడా పిలించి సత్కరించారు. ఆ కార్యక్రమం తర్వాత అతడు నాజీ సైనికుడు అని తెలిసిందట. దీంత ట్రూడోపై తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి. యూదులను ఊచకోత కోసి హుంకాలను యూదుడే అయిన జెలెన్‌స్కీ ముందు సన్మానించి యాదులను కించపరిచారని విమర్శలు వచ్చాయి. అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు ఓ నాజీని సన్మానించి ట్రూడో జాతివివక్షను బయటపెట్టుకున్నాడని యూదులు నిప్పులు చెరిగారు. రష్యా కూడా నిరసన తెలిపింది. దీనికి బాధ్యత వహిస్తూ స్పీకర్ ఆంటోనీ రోటా పదవి నుంచి తప్పుకున్నారు. హుంకా పెద్ద హీరో అని పొడిగిన రోటా, తర్వాత తనకు అతని అసలు సంగతి తెలియదని చెప్పుకొచ్చారు. విధిలేని పరిస్థతిలో ట్రూడో ఉక్రెయిన్‌కు క్షమాపణ చెప్పాడు. ‘‘ఆరోజు మా పార్లమెంటులో జరిగినదానికి బేషరతు క్షమాపణ చెబుతున్నాను. నాజీల చేతుల్లో కష్టాలు అనుభవించిన వారిని కించపరించాం, అతణ్ని గౌరవించి భయంకరమైన తప్పిందం చేశాం’’ అని అన్నారు.


Updated : 28 Sep 2023 7:11 AM GMT
Tags:    
Next Story
Share it
Top