Home > అంతర్జాతీయం > Chandrayaan-3 Mission Success : జాబిల్లిపై చంద్రయాన్-3.. జయహో ఇస్రో

Chandrayaan-3 Mission Success : జాబిల్లిపై చంద్రయాన్-3.. జయహో ఇస్రో

Chandrayaan-3 Mission  Success : జాబిల్లిపై చంద్రయాన్-3.. జయహో ఇస్రో
X

యావత్ భారతదేశం గర్వించదగ్గ క్షణమిది. ప్రపంచంలో ఏ దేశం చేరుకోలేని చంద్రుడి దక్షిణ ధృవానికి చంద్రయాన్-3 సక్సెస్ ఫుల్ గా చేరుకుంది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై సేఫ్ గా ల్యాండ్ అయ్యాయి. జులై 14న మధ్యాహ్నం 2:35 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన మన రాకెట్.. దాదాపు 40 రోజుల తర్వాత చంద్రుడిపై అడుగుపెట్టింది. బుధవారం సాయంత్రం 6:03 గంటలకు.. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించిన సమయంలోనే ల్యాండర్ చంద్రుడిపై సురక్షితంగా అడుగుపెట్టింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ చంద్రయాన్-3 సక్సెస్ అయిన విషయాన్ని ప్రపంచానికి తెలిపారు.

ల్యాండింగ్ పూర్తయిన 4 గంటల తర్వాత ల్యాండర్ ర్యాంప్ బయటికి వస్తుంది. అందులో నుంచి 6 చక్రాల ప్రజ్ఞాన్ రోవర్ నెమ్మదిగా చంద్రుడిపై దిగుతుంది. ఆ తర్వాత సెకనుకు సెంటీమీటర్ వేగంతో చంద్రుడిపై కదులుతుంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలంపైనే ఉండి పరిశోధనలు చేస్తాయి. చంద్రయాన్-3 సక్సెస్ అయిన నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా ఇస్రోకు ప్రశంసల వెల్లువలు కురుస్తున్నాయి. ప్రపంచం ముందు భారత కీర్తి పతాకాన్ని ఎగరేసిన శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Updated : 23 Aug 2023 6:38 PM IST
Tags:    
Next Story
Share it
Top