Home > అంతర్జాతీయం > చార్లీ చాప్లిన్ కూతురు కన్నుమూత

చార్లీ చాప్లిన్ కూతురు కన్నుమూత

చార్లీ చాప్లిన్ కూతురు కన్నుమూత
X

హాస్యానికి కేరాఫ్ అడ్రస్ చార్లీ చాప్లిన్. ఆయన గతించి దశాబ్దాలు కావస్తున్నా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన కుటుంబసభ్యుల్లో చాలా మంది నటులు ఉన్నారు. చాప్లిన్, ఉనా ఓనీల్ దంపతుల ఎనిమిదిమంది సంతానంలో మూడో బిడ్డయిన జోసెఫిన్ చాప్లిన్ కూడా నటే. 74 ఏళ్ల జోసఫిన్ పారిస్లో అనారోగ్య కారణాలతో చనిపోయారు. ఈ నెల 13వ తేదీనే ఆమె చనిపోయినా విషయం ఆలస్యంగా బయటికొచ్చింది. వృద్ధాప్య కారణాలతో ఆమె చనిపోయినట్లు చెబుతున్నారు.

సోసఫిన్ బాల్యం నుంచే సినిమాల్లోకి ప్రవేశించింది. చాప్లిన్ సినిమా లైమ్‌ లైట్(1952) చిత్రంలో బాలనటిగా కనిపించింది. పలు హాలీవుడ్, ఇటాలియన్ సినిమాల్లో మంచి పాత్రలు దక్కాయి. ‘కాంటర్బరీ టేల్స్’, ‘ఎల్ ఆడూర్’, ‘ఎస్కేప్ టు ద సన్’, క్రైమ్ థ్రిల్లర్ ‘షాడో ఉమన్’లతోపాటు టీవీ సీరియళ్లలోనూ సత్తా చాటింది. జోసఫిన్ 1969లో గ్రీకు వ్యాపారి నికోలస్‌ను పెళ్లి చేసుకుని 1977లో విడాకులు తీసుకుంది. ఫ్రెంచి నటుడు మారిస్ రోనెట్‌తో సహజీవనం చేసింది. అతడు చనిపోయాక ఆర్కియాలజిస్ట్ జీన్‌ క్లూడ్‌ గార్డెన్‌ను పెళ్లాడింది. ఆమెకు ముగ్గురు పిల్లలు.

Updated : 23 July 2023 10:25 AM IST
Tags:    
Next Story
Share it
Top