China New Virus : చైనాలో మరో మహమ్మారి.. పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్న పిల్లలు
X
కరోనా సృష్టించిన విలయ తాండవానికి ప్రపంచం వణికిపోయింది. లక్షల మందిని బలిదీసుకుంది. ఆ వైరస్ చైనా నుంచి వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. ఆ మహమ్మరి మిగిల్చిన విషాదం నుంచి చైనా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కాగా మరో ప్రాణాంతక వైరస్ జబ్బు చైనాను వణికిస్తుంది. స్కూళ్లకు వెళ్లున్న పిల్లలు అంతుచిక్కని న్యుమోనియా లక్షణాల బారినపడి హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ విషయంపై ప్రోమెడ్ సంస్థ చైనాను అప్రమత్తం చేసి.. ఓ నివేదికను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వ్యాధి లక్షణాల్లో దగ్గు లేకపోయినా ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్, శ్వాససంబంధ ఇబ్బందులు, జ్వరం వంటివి ఉంటాయి. ఈ లక్షణాలతో బీజింగ్, లియనోనింగ్ ప్రాంతాల్లోని హాస్పిటల్ లన్నీ పిల్లలతో నిండిపోయాయి. దీంతో వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందకుండా స్కూళ్లను తాత్కాలికంగా మూసేశారు.
ఒకేసారి వందల మంది పిల్లలు అనారోగ్యానికి గురి కావడం అసాధారణ విషయమని, ఈ జబ్బు ఎప్పుడు, ఎలా పుట్టుకొచ్చిందో స్పష్టత లేదని అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది టీచర్లకు కూడా ఈ వ్యాధి సోకింది. కాగా ఇది కరోనా లాగ ప్రమాదకరమా? కాదా? అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని ప్రోమోడ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ వో అంతుపట్టని ఈ వ్యాధిపై పూర్తి నివేదిక ఇవ్వాలని చైనా ప్రభుత్వాన్ని కోరింది. జబ్బు లక్షణాలు, అనారోగ్యానికి గురవుతున్న ప్రాంతాల వివరాలు ఇవ్వాలని పేర్కొంది. అలాగే, ఈ జబ్బు వ్యాప్తి చెందకుండా చైనా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
⚠️UNDIAGNOSED PNEUMONIA OUTBREAK—An emerging large outbreak of pneumonia in China, with pediatric hospitals in Beijing, Liaoning overwhelmed with sick children, & many schools suspended. Beijing Children's Hospital overflowing. 🧵on what we know so far:pic.twitter.com/hmgsQO4NEZ
— Eric Feigl-Ding (@DrEricDing) November 22, 2023