Home > అంతర్జాతీయం > ఇండియా పేరు మార్పుపై.. చైనా రియాక్షన్

ఇండియా పేరు మార్పుపై.. చైనా రియాక్షన్

ఇండియా పేరు మార్పుపై.. చైనా రియాక్షన్
X

ప్రస్తుతం చర్చంతా దేశం పేరు మార్పుపైనే నడుస్తోంది. ఇండియా పేరు తొలగించి భారత్గా మారుస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. G20 డిన్నర్ ఇన్విటేషన్లో 'ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా’కి బదులుగా 'ప్రెసిడెంట్‌ ఆఫ్ భారత్' అని ఉండడంతో దేశం పేరు మారుస్తున్నారన్న చర్చ షురూ అయ్యింది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇండియా పేరు మార్పుపై చైనా స్పందించింది.

అంతర్జాతీయ ప్రభావాన్ని పెంచుకునేందుకు జీ20 వేదికను అవకాశంగా మార్చుకోవాలని భారత్‌ కోరుకుంటోందని చైనా తన అక్కసు వెళ్లగక్కింది. పేరు కంటే ఇతర ముఖ్య విషయాలపై దృష్టి సారించాలని చైనా అధికారిక పత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్‌’ తన కథనంలో వ్యాఖ్యానించింది. ‘‘విప్లవాత్మక సంస్కరణలు లేకుండా.. భారత్‌ విప్లవాత్మక అభివృద్ధిని సాధించలేదు. అయితే భారత్‌కు పెరుగుతున్న అంతర్జాతీయ దృష్టిని సద్వినియోగం చేసుకొని.. అభివృద్ధికి ఇంధనంగా మార్చుకోగలదని ఆకాంక్షిస్తున్నాం. కేవలం వలసవాదంగా భావిస్తున్న పేరును తొలగించే ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది’’ అని చైనా వ్యాఖ్యానించింది.

జీ20 సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న భారత్‌.. ఆర్థిక సంస్కరణలపై దృఢ సంకల్పాన్ని తెలియజేసేందుకు ఈ వేదికను వాడుకోవాలని చైనా సూచించింది. దేశం పేరు మార్చాలా? వద్దా? అనే దానికంటే ఆర్థిక సంస్కరణలపై దృష్టి సారించడం ముఖ్యమైందని చెప్పింది. కాగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చుకునే అధికారం కేంద్రానికి ఉంది. అయితే రాజ్యాంగంలో చేసే మార్పులకు పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఈ క్రమంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌-1కి సవరణ ప్రతిపాదిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లుగానీ, తీర్మానం గానీ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.



Updated : 7 Sep 2023 10:53 AM GMT
Tags:    
Next Story
Share it
Top