Home > అంతర్జాతీయం > రికార్డ్.. 1300 కిలోమీటర్లకు 150 నిమిషాలు చాలు.. ఎక్కడంటే..!

రికార్డ్.. 1300 కిలోమీటర్లకు 150 నిమిషాలు చాలు.. ఎక్కడంటే..!

రికార్డ్.. 1300 కిలోమీటర్లకు 150 నిమిషాలు చాలు.. ఎక్కడంటే..!
X

అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన బుల్లెట్ ట్రైన్.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ట్రైన్గా ప్రసిద్ధి చెందింది. వందల కిలోమీటర్లను కేవలం గంటల వ్యవధిలో చేరుకుని రికార్డు నెలకొల్పింది. ఏ దేశానికి సాధ్యం కాని ప్రాజెక్ట్ను మొదలుపెట్టి చైనా సక్సెస్ అయింది. మన దేశంలో రైళ్ల పరిస్థితి అందరికీ తెలిసిందే. మన దగ్గర మరీ హై స్పీడ్ రైళ్లో ప్రయాణం చేయాలంటే.. 500 కిలోమీటర్ల దూరాన్ని 6 నుంచి 8 గంటల్లో చేరుకోవచ్చు. అదే విమానంలో అయితే.. 1-2 గంటలు పడుతుంది.

కానీ, చైనాలోని బుల్లెట్ ట్రైన్లో అదంతా జుజుబీ. అక్కడి రైళ్లు విమానం కన్నా వేగంగా ప్రయాణిస్తాయి. ఫక్సింగ్ బుల్లెట్ ట్రైన్ 1300 కిలో మీటర్ల వేగాన్ని కేవలం 4.5 గంటల్లో చేరుకుంటుంది. అదే ఇప్పటివరకు ఆల్ టైం రికార్డ్. కానీ ఈ స్పీడ్ సరిపోవడం లేదంటున్నారు అక్కడివాళ్లు. అందుకే మరో కొత్త రైలును చైనా ప్రభుత్వం పరీక్షిస్తోంది. ఈ ట్రైన్ 2.5 గంటల్లోనే 1300 కిలోమీటర్లు వెళ్తుందట. ఈ ట్రైన్ ట్రయల్ రన్కు సంబంధించిన వీడియోను ప్రపంచ పర్యావరణవేత్త ఎరిక్ సోలీమ్ ట్వీట్ చేశారు.


Updated : 11 Aug 2023 10:45 AM GMT
Tags:    
Next Story
Share it
Top