Home > అంతర్జాతీయం > చైనా ప్రభుత్వం హెచ్చరిక.. 50 kgలకంటే తక్కువ బరువున్న వాళ్లు బయటికి వస్తే..

చైనా ప్రభుత్వం హెచ్చరిక.. 50 kgలకంటే తక్కువ బరువున్న వాళ్లు బయటికి వస్తే..

చైనా ప్రభుత్వం హెచ్చరిక.. 50 kgలకంటే తక్కువ బరువున్న వాళ్లు బయటికి వస్తే..
X

దక్షిణ చైనాలో ‘సోలా’ తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. ముందస్తు జాగ్రత్తగా అక్కడి ప్రజలను ఒక రోజు ముందే దాదాపు 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్ ఎఫెక్ట్ తో హాంకాంగ్ లోని చాలా ప్రాంతాలు, దక్షిణ చైనా తీర ప్రాంతాల్లోని వ్యాపార సముధాయాలు, రవాణా సేవలు, స్కూళ్లు పూర్తిగా మూసేశారు. సోలా తుఫాను హాంకాంగ్ దక్షిణాన ఉన్న జుహై నగరాన్ని మధ్యాహ్నం 3:30 గంటలకు తాకినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు సురక్షితంగా ఉండేందుకు పలు హెచ్చరికలు జారీ చేసింది.





ఈ నేపథ్యంలో 50 కిలోల కన్నా తక్కువ బరువున్న వ్యక్తులు బయటికి రావొద్దని చైనా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోలా తుఫాను గంటకు 17 కిలోమీటర్ల వేగంతో గ్వాంగ్ డాంగ్ తీరం వెంబడి నైరుతి దిశలో కదులుతుంది. 50 కిలోలకన్నా తక్కువ బరువున్న వాళ్లు బయటికి వస్తే.. బలమైనా ఆ గాలులకు కొట్టుకుపోతారని ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. తుఫాను గాలికి కొట్టుకుపోయిన ఓ యువతి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తుఫాను కారణంగా విమానాలు, రైళ్లను రద్దు చేసింది ప్రభుత్వం. ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది.





Updated : 2 Sept 2023 9:42 PM IST
Tags:    
Next Story
Share it
Top