Home > అంతర్జాతీయం > ఇండియాపై మరోసారి విషం కక్కిన చైనా

ఇండియాపై మరోసారి విషం కక్కిన చైనా

ఇండియాపై మరోసారి విషం కక్కిన చైనా
X

ఇండియాపై చైనా మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చైనా దేశం తప్పుబట్టింది. ఈ సందర్భంగా చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ తాజాగా ఆర్టికల్ 370 అంశంపై స్పందించారు. లద్దాఖ్ ను భారత్ ఏకపక్షంగా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిందని, లద్దాఖ్ ఏర్పాటును తాము గుర్తించడం లేదంటూ నోరు పారేసుకున్నారు. 370 ఆర్టికల్ పై తాజాగా భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చైనా-ఇండియా సరిహద్దు పశ్చి భాగ వాస్తవ స్థితిన మార్చలేదని వ్యాఖ్యనించారు. ఆ ప్రాంతం ఎప్పటికీ తమ భూభాగంలో భాగమని నోరుపారేసుకున్నారు. కాగా భారత్-పాక్ ల మధ్య ఎంతో కాలంగా ఈ వివాదం కొనసాగుతోంది.

గతంలో చాలా సార్లు డ్రాగన్ దేశం ఇండియాను విమర్శిస్తూ పాక్ కు బాసటగా నిలిచింది. వీలు చిక్కినప్పుడల్లా భారత్ పై చైనా విషం కక్కుతోంది. 2019, ఆగస్టు 5న భారత్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలకు అంతర్జాతీయ గుర్తింపు లేదని పాక్ వాదించగా.. పాక్ వాదనలను చైనా సమర్థించింది. ఇరు దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం శాంతియుత మార్గంలో చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని, కశ్మీర్ విషయంలో చైనా వైఖరి స్పష్టంగా ఉందని డ్రాగన్ తన వక్రబుద్ధిని బయటపెట్టింది.


Updated : 14 Dec 2023 10:11 AM GMT
Tags:    
Next Story
Share it
Top