Home > అంతర్జాతీయం > చైనాలో విషాదం.. పర్వతం కూలి 19 మంది మృతి

చైనాలో విషాదం.. పర్వతం కూలి 19 మంది మృతి

చైనాలో విషాదం.. పర్వతం కూలి 19 మంది మృతి

చైనాలో విషాదం.. పర్వతం కూలి 19 మంది మృతి
X



చైనాలో విషాదం చోటు చేసుకుంది నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లో ఆదివారం కొండచరియలు విరిగిపడటంతో 19 మంది మృతి చెందారని స్థానిక ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. లెషాన్ నగరానికి సమీపంలోని జిన్‌కౌహే జిల్లా యోంగ్‌షెంగ్ టౌన్‌షిప్‌లోని అటవీ క్షేత్రంలో ఆదివారం ఉదయం 6 గంటలకు కూలిపోయినట్లు జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.. ఒక్కసారిగా మట్టి కుప్పలు కూలిపోవడంతో జనాలు వీటి కింద చిక్కుకుపోయారు. బాధితుల శవాలను తీసేందుకు జరిపిన రెస్క్యూ ఆపరేషన్ రాత్రి 8 గంటలకు ముగిసింది. పర్వతం కూలిపోవడానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.




రెస్క్యూ ఆపరేషన్ కోసం 180 మందిని సంఘటన స్థలానికి పంపారు. ఈ ప్రదేశం సిచువాన్ రాజధాని చెంగ్డూకు దక్షిణంగా 240 కిలోమీటర్ల దూరంలో పర్వత ప్రాంతంలో ఉంది. చైనాలో గ్రామీణ పర్వత ప్రాంతాల్లో, ముఖ్యంగా వేసవి నెలలో కొండచరియలు విరిగిపడటం తరుచుగా జరుగుతోంది. అడవులు, కొండలు అధికంగా ఉన్న సిచువాన్ ప్రావిన్స్ లో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలో 2017 సమయంలో జిన్మో గ్రామంపై కొండచరియలు విరిగిపడటంతో 60పైగా ఇళ్లు సమాధి అయ్యాయి.





Updated : 5 Jun 2023 7:08 AM GMT
Tags:    
Next Story
Share it
Top