Home > అంతర్జాతీయం > ప్రైవేట్ కంపెనీ బంపర్ ఆఫర్.. పిల్లల్ని కంటే రూ. 5 లక్షలు..!

ప్రైవేట్ కంపెనీ బంపర్ ఆఫర్.. పిల్లల్ని కంటే రూ. 5 లక్షలు..!

ప్రైవేట్ కంపెనీ బంపర్ ఆఫర్.. పిల్లల్ని కంటే రూ. 5 లక్షలు..!
X

చైనాలోని ఓ ప్రైవేట్ కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. పిల్లల్ని కంటే ఏడాదికి లక్ష చొప్పున్న మొత్తం ఐదేళ్లలో రూ. 5 లక్షలు ఇస్తామని ప్రకటించింది. చైనాలో యువత జనాభా తగ్గి, వృద్ధుల సంఖ్య పెరుగుతున్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ కంపెనీ ఏదంటే.. చైనా అతిపెద్ద ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ ట్రిప్ డాట్ కామ్.





ట్రిప్ డాట్ కామ్... తమ ఉద్యోగులు ఎక్కువ మంది పిల్లల్ని కలిగి ఉండేలా ప్రోత్సహించేందుకు.. పిల్లల సంరక్షణ రాయితీలను ప్రకటించింది. కంపెనీలోని ఉద్యోగులు పిల్లల్ని కంటే.. ఏడాదికి లక్ష చొప్పున ఐదేళ్లలో రూ. 5.6 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ జూన్ 30న ప్రకటించగా.. జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కంపెనీలో 3ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. పిల్లల్ని కన్నవాళ్లకు ఆర్థిక ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రిప్ డాట్ కామ్ యాజమాన్యం తెలిపింది.




Updated : 1 July 2023 10:37 PM IST
Tags:    
Next Story
Share it
Top