Home > అంతర్జాతీయం > 'నో పెళ్లి' అంటున్న చైనా.. ఎందుకంటే ?

'నో పెళ్లి' అంటున్న చైనా.. ఎందుకంటే ?

నో పెళ్లి అంటున్న చైనా.. ఎందుకంటే ?
X

పెళ్లి అనే పదం వినిపిస్తే చాలు, చైనా యువత రెండు అడుగులు వెనక్కి వేస్తోంది. వయసు పెరుగుతున్నా కూడా పెళ్లిపైన అసలు చైనా యూత్ ఆసక్తి చూపించడం లేదు. అందుకు గృహ హింసే కారణమని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో ఈ మధ్య గృహిణులపై భౌతిక దాడులు, హత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో పెళ్లి బంధంపై యువతకు నమ్మకం లేకుండా పోతతోంది . ఓ వైపు చైనా ప్రభుత్వం జనాభా పెరుగుదల కోసం ప్రజలకు ఎన్నో రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తూ విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు యువత మాత్రం పెళ్లికి నో చెబుతుండటంతో ఇప్పుడు దేశంలో ఇది పెద్ద సమస్యగా మారింది.

రీసెంట్‎గా చైనాలోని షాన్‌డాగ్‌ తూర్పు ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి తన అర్థాంగిని అతి కిరాతంగా హతమార్చాడు. ఆమెపై కారును ఎక్కించి దారుణంగా చంపేశాడు. ఈ దారుణమైన సంఘటనకు కుటుంబ సమస్యలే కారణం అని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో ఈ మధ్య బాగా వైరల్‌ అయ్యింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 300 మిలియన్లకు పైగా నెటిజన్లు వీక్షించారు. అంతకు ముందు ఇలాంటి సంఘటనలు ఎన్నో చైనాలో జరిగాయి. గ్వాంగ్‌డాంగ్‎లోని దక్షిణ ప్రావిన్స్‌లో ఉంటున్న ఒక మహిళ చాలా ఏళ్లుగా గృహ హింస అనుభవించింది. చివరకు భర్త చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది. సదరు భర్త భార్యతో పాటు ఆమె కోడలిని కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు. చెంగ్డూలోనూ ఓ మహిళ తన భర్త ఆగడాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన భర్త 16 సార్లు హత్యయత్నం చేశాడని చెప్పుకొచ్చింది. ఆ వేధింపులు భరించలేకే డైవోర్స్ తీసుకున్నట్లు తెలిపింది. గృహిణులపై ఇలాంటి దారుణాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోవడంతో...యువత పెళ్లిపై ఆసక్తి చూపించడంలేదని స్థానిక మీడియా సంస్థలు వార్తలను ప్రచురించాయి.

ఇన్నాళ్లు జనాభా రేటులో ప్రథమ స్థానంలో ఉన్న చైనా ప్రస్తుతం జననాల రేటు తగ్గుదలతో ఆందోళన చెందుతోంది. చైనా పౌర సంబంధాల వ్యవహారాల మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం 2021తో పోలిస్తే.. 2022లో వివాహం చేసుకునే వారి సంఖ్య 10.5 శాతం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో చైనా సర్కార్ పెళ్లిళ్లు చేసుకునేవారికి, పిల్లలు కనేవారికి ప్రత్యేకంగా ఏ దేశం ఇవ్వనటువంటి రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తోంది. జనాభా రేటును పెంచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వం ఆఫర్లు అందిస్తున్నప్పటికీ యువత మాత్రం పెళ్లి చేసుకునేందుకు విముఖంగా ఉంటోంది.


Updated : 3 July 2023 3:59 PM IST
Tags:    
Next Story
Share it
Top