కుర్రాళ్లకు జాక్ పాట్.. 25 ఏళ్లలోపు పెళ్లి చేసుకుంటే?
X
25 ఏళ్లు నిండిన వాళ్లకు ఈ బంపర్ ఆఫర్. పెళ్లి చేసుకున్నారా.. మీకు ప్రభుత్వం రివార్డ్ ఇస్తుంది. అయితే ఇది మన దేశంలో కాదు.. చైనాలో. చైనాలో బర్త్ రేట్ పడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ యూత్ కన్నా ముసలివాళ్లే ఎక్కువున్నారు. ఇప్పుడున్న యూత్ పెళ్లీ, పిల్లలపై ఆసక్తి చూపడం లేదు. దాంతో చైనా యువతకు సంసారంపై ఆసక్తి కలిగించేందుకు రకరకాల స్కీంలు తీసుకొస్తుంది. తాజాగా మరో బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.
25 లేదా అంతకంటే తక్కువ వయసులో పెళ్లి చేసుకునే యువతులకు రివార్డ్ ప్రకటించింది. జెజియాంగ్ రాష్ట్రంలోని చాంగ్షాన్ కౌంటీ ఈ నిర్ణయం తీసుకుంది. యువతులకు తగిన వయసులో పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేలా ప్రోత్సహించేందుకు నగదు బహుమతి ప్రవేశపెట్టింది. దీని ప్రకారం తొలి వివాహం చేసుకునే 25ఏళ్ల యువతులకు 1000 యువాన్లు అంటే దాదాపు రూ.11,500 రివార్డ్ ఇవ్వనుంది. అంతేకాదు.. ఒకవేళ దంపతులకు పిల్లలు పుడితే.. వాళ్ల సంరక్షణ, ఎడ్యుకేషన్ సబ్సిడీలు కూడా అందించనుంది.