Home > అంతర్జాతీయం > ఫుల్‎టైమ్ కూతురు..సొంత బిడ్డకు జీతం ఇచ్చి మరీ..

ఫుల్‎టైమ్ కూతురు..సొంత బిడ్డకు జీతం ఇచ్చి మరీ..

ఫుల్‎టైమ్ కూతురు..సొంత బిడ్డకు జీతం ఇచ్చి మరీ..
X

పిల్లలు పెరిగి పెద్దయ్యాక తల్లిదండ్రులతో గడిపే సమయం దొరకదు. కొంత మంది పని ఒత్తిడిలో కన్నవారిని పట్టించుకోవడమే మానేస్తారు. ఈ రోజుల్లో ఇది చాలా కామన్ విషయమే. ఓ ఏజ్ వచ్చేసరికి కుటుంబ బాధ్యతలు భుజాన పడటంతో ఉద్యోగం చేసే పిల్లలందరూ తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేయడం చాలా అరుదుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో తమ కూతురుతో హాయిగా గడపాలనుకున్న చైనాలోని ఓ వృద్ధ తల్లిదండ్రులకు ఓ గొప్ప ఐడియా వచ్చింది. తమ కూతురినే ఫుల్ టైమ్ కూతురిగా నియమించుకుని ప్రతి నెల జీతం కూడా ఇస్తున్నారు. తన వృద్ధ తల్లిదండ్రులకు పూర్తి-సమయం కుమార్తె కావడానికి తన ఉద్యోగాన్ని వదులకుంది. అందుకు ఆమెకు వారి తల్లిదండ్రులు ప్రతి నెల 4,000 యువాన్లు అంటే రూ.47వేలు ఇస్తున్నారు.



నియానన్ అనే 40 ఏళ్ల మహిళ గతంలో ఒక వార్తా సంస్థలో 15 సంవత్సరాలు పనిచేసింది. అయితే, 2022లో, కంపెనీలో ఉద్యోగ రిత్యా ఆమెపై ఒత్తిడి విపరీతంగా పెరిగింది. రోజులోని ప్రతి సెకనుకు ఆన్-కాల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.



ఈ క్రమంలో కూతురు ఇబ్బందిని గుర్తించిన పేరెంట్స్ ఆమెకు బంపర్ ఆఫర్ అందించారు. ఆమె చేస్తున్న ఉద్యోగాన్ని విడిచి తమతో ఫుల్‎టైమ్ కూతురిగా ఉండాలని అందుకోసం జీతం కూడా ఇస్తామని ఆమెను కోరారు. ఇది నియానన్ తిరస్కరించలేని మధురమైన ఒప్పందంగా మారింది. దీంతో ఉద్యోగాన్ని వీడి ఆమె తన వృద్ధ తల్లిదండ్రులతో ఇంట్లో ఉంటూ వారికి సహాయం చేస్తూ కాలక్షేపం చేస్తూ ఆనందంగా జీవిస్తోంది.





Updated : 4 Jun 2023 2:39 PM IST
Tags:    
Next Story
Share it
Top