Home > అంతర్జాతీయం > Citigroup Layoffs: సిటీ గ్రూప్ లేఆఫ్.. 20 వేల మంది ఉద్యోగులు ఔట్

Citigroup Layoffs: సిటీ గ్రూప్ లేఆఫ్.. 20 వేల మంది ఉద్యోగులు ఔట్

Citigroup Layoffs: సిటీ గ్రూప్ లేఆఫ్.. 20 వేల మంది ఉద్యోగులు ఔట్
X

అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్ వచ్చే రెండేళ్లలో 20 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. నాల్గవ త్రైమాసికంలో 1.8 బిలియన్ డాలర్ల నష్టాల కారణంగా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 2,39,000 మంది ఉద్యోగులు ఉన్నారని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మార్క్ మాసన్ తెలిపారు. 180,000 మంది ఉద్యోగులను చేరుకోవడమే కంపెనీ లక్ష్యమని వెల్లడించారు.. ఏ కంపెనీకైన ఇలాంటి నిర్ణయాలు కష్టతరమే అయినప్పటికి.. మనోధైర్యంతో నిర్ణయం తీసుకోకతప్పదని వెల్లడించారు. సిబ్బంది కోత వల్ల ఆదాయ వృద్ధికి ఆటంకం ఉండదన్నారు. ఉద్యోగాల కోత వల్ల $1.8 బిలియన్ల వరకు ఖర్చు అవుతుందని, అయితే 2026 నాటికి $2.5 బిలియన్లు ఆదా అవుతాయని తెలిపారు. జనవరి చివరి వారంలో, సిటీ గ్రూప్ మరిన్ని సంస్థాగత మార్పులను ప్రకటించే అవకాశం ఉంది.

ఇక సిటీ గ్రూప్ 2023 (అక్టోబర్-డిసెంబర్) నాలుగో త్రైమాసికంలో 1.8 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది.. అంతకు ముందు సంవత్సరం కంటే 3% తగ్గి మెుత్తంగా నష్టాలు $17.4 బిలియన్లకు చేరుకున్నాయి. 2023 చివర్లో క్లయింట్ కార్యకలాపాల మందగమనం. కరెన్సీల రెట్లు పడిపోవడంతో ఐదేళ్లలో సిటీ గ్రూప్ స్థిర-ఆదాయ వ్యత్యాసం కనిష్టానికి చేరుకుంది. వ్యాపారం నుండి వచ్చే ఆదాయం 25% క్షీణించి $2.6 బిలియన్లకు తగ్గింది.

Updated : 13 Jan 2024 10:07 AM IST
Tags:    
Next Story
Share it
Top