Home > అంతర్జాతీయం > విమానం టాయిలెట్లో కక్కుర్తిపడిన జంట.. చూశారని దబ్బున..

విమానం టాయిలెట్లో కక్కుర్తిపడిన జంట.. చూశారని దబ్బున..

విమానం టాయిలెట్లో కక్కుర్తిపడిన జంట.. చూశారని దబ్బున..
X

కామాతురాణం న భయం న లజ్జ అన్నారు పెద్దలు. కోరిక పుడితే భయం, సిగ్గూ ఎగ్గూ లేకుండా ప్రవర్తిస్తుంటారని దాని అర్థం. మనదేశంలో ఈ ధోరణి లేకపోయినా విదేశాల్లో మాత్రం రోడ్లపక్కన ముద్దులు, కౌగిలింతలు, ఎట్‌సెట్రాలు కామనే. మెట్రో రైళ్లు, విమానాలు.. ఏవీ ప్రేమకలాపాలకు అనర్హం కావు.

గాల్లో రయ్యిమని ఎగురుతున్న విమానంలోని ఓ జంటకు ఉన్నట్లు ఘాటు ప్రేమ పుట్టింది. మొదట ముద్దులతో సరిపెట్టుకున్నారు. వాటితో ఆగలేక టాయిలెట్లోకి దూరిపోయారు. టాయిలెట్ నుంచి ఎంతవరకు బయటికి రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. తలుపు తీయగా బీభత్స శృంగార దృశ్యం కనిపించింది. ప్రేమికుడు దబ్బును తలుపేసుకున్నాడు. అయితే అప్పటికే ఓవరో ఆ దృశ్యాన్ని వీడియోలో బంధించారు. విమాన సరసం చూసిన సిబ్బంది, ప్రయాణికులు ఆశ్చర్యం, సంబరం తట్టుకోలేక తెగ ఉద్వేగానికి గురయ్యారు. దృశ్యం అంతటితో పూర్తికాలేదు. విమానంలో అనుచిత చర్యకు పాల్పడి న్యూసెన్స్ చేశారని సిబ్బంది ఆ ప్రేమ జంటను పోలీసులు పట్టించింది. బ్రిటన్‌లోని లుటన్ నుచి ఇబిజాకు వెళ్తున్న ఈజీజెట్ విమానంలో ఈ నెల 8న ఈ సంఘటన చోటు చేసుకుంది.

Updated : 13 Sept 2023 11:35 AM IST
Tags:    
Next Story
Share it
Top