Home > అంతర్జాతీయం > వీడు మామూలోడు కాదు.. బైక్‌పై భారీ ఎద్దుతో డ్రైవింగ్

వీడు మామూలోడు కాదు.. బైక్‌పై భారీ ఎద్దుతో డ్రైవింగ్

వీడు మామూలోడు కాదు.. బైక్‌పై భారీ ఎద్దుతో డ్రైవింగ్
X

'ఏం కాకులు మాత్రం పక్షులు కావా..? వాటికి మాత్రం రెక్కలుండవా? మిగతా పక్షులని పెంచుకునేటప్పుడు కాకులను మాత్రం ఎందుకు పెంచుకోకూడదు..' ఓ తెలుగు సినిమాలో ఆలోచింపచేసే డైలాగ్ ఇది. సరిగ్గా ఇదే అనుకున్నాడో లేదంటే అవసరమొచ్చిందేమో కానీ ఓ వ్యక్తి తన ఇంట్లోని సాదు జంతువులను బైక్‌పై తీసుకెళ్లాడు. సాదు జంతువంటే.. అదేదో కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు కాదండోయ్..! గేదె, ఆవు లాంటి భారీ శరీరంతో ఉన్న పశువులని.. వాటినెలా తీసుకెళ్లగలమని ప్రశ్నిస్తారా..? అయితే ఈ వీడియో చూడండి. ఓ వ్యక్తి భారీకాయం కలిగిన ఎద్దును తన మోటార్ సైకిల్‌పై తీసుకెళ్తున్నాడు. అచ్చం తన చంటిబిడ్డను ఎలాగైతే కూర్చొబెట్టుకుని తీసుకువెళ్తాడో.. అలాగే..ఆ ఎద్దుని కూర్చోబెట్టుకుని వెళ్తున్నాడు. అయితే అతడు చేసిన ఈ వింత విన్యాసాన్ని కొందరు వాహనదారులు, ప్రయాణికులు వీడియో తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టిట్లో హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘వీడు మామూలోడో కాదు..’, ‘నువ్వు గ్రేట్ సామి’ అంటూ పేర్కొంటున్నారు. బైక్ నడిపే వ్యక్తి గురించి అలా ఉంచితే.. ఆ ఎద్దుసైతం బైక్‌పై కదలకుండా చక్కగా కూర్చుంది. ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


ఆ వ్యక్తి తన బైక్‌లో ముందు సీటుపై ఆవును మోసుకెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ ఆవు కూడా అతన్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. అయితే ఆవు ఏమాత్రం ఎగిరినా, కాస్త అటు ఇటు కదిలి ఉంటే కూడా ప్రమాదం జరిగి ఉండేది. ఇంతకుముందు కూడా కొన్ని చోట్ల ఇలాంటి వింత విన్యాసాలు చోటుచేసుకున్నాయి. ఓ వ్యక్తి .. తన పెంపుడు దూడకి ఓ సంచి తగిలించి, ఆ తర్వాత బండిపై దాన్ని ఎక్కించి అచ్చం ఇలాంగే బండి నడిపాడు. ఆ రైడ్‌కు సంబంధించిన వీడియోలు మరియు ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి.

వీరంతా ఆ బైక్‌లపై పశువులను ఎలా కూర్చోబెట్టి ఉంటాడని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కావాసాకి కాదు.. 'కౌ'వాసాకి అంటూ రకరకాల కామెంట్లు, విమర్శలతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.



Updated : 12 Nov 2023 8:53 AM IST
Tags:    
Next Story
Share it
Top