Home > అంతర్జాతీయం > Chile : చిలీలో కార్చిచ్చు..బుగ్గిపాలవుతున్న బతుకులు

Chile : చిలీలో కార్చిచ్చు..బుగ్గిపాలవుతున్న బతుకులు

Chile : చిలీలో కార్చిచ్చు..బుగ్గిపాలవుతున్న బతుకులు
X

చిలీ (Chile) లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో చిలీలో చెలరేగిన కార్చిచ్చు చుట్టూ ప్రక్కల ప్రాంతాలకు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ ఘటనలో 46 మంది మృతి చెందగా వేలాది మంది గాయపడ్డారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. దాదాపు 1,100 ఇళ్లు మంటల్లో కాలిబూడిదైనట్లు తెలిపారు. ఈ ఘటనపై దేశాధ్యక్షుడు బోరిక్ గాబ్రియల్ స్పందించారు. వాల్పరైజో ప్రాంతంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.

సహాయక చర్యలు చేపడుతున్న వారికి సహకరించాలని బోరిక్‌ విజ్ఞప్తి చేశారు. మంటలు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయని...వాటిని అదుపు చేసేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదని చెప్పారు. అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు, స్వల్ప తేమ.. పరిస్థితులను మరింత దయనీయంగా మారుస్తున్నాయని తెలిపారు. దేశ మధ్య, దక్షిణ ప్రాంతాల్లో దాదాపు 92 కార్చిచ్చులు చెలరేగినట్లు మంత్రి కరోలినా తాజాగా తెలిపారు. మంటల తీవ్రత అధికంగా ఉన్న వాల్పరైజో ప్రాంతం నుంచి ఇప్పటికే వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు.




Updated : 4 Feb 2024 5:07 AM GMT
Tags:    
Next Story
Share it
Top