Home > అంతర్జాతీయం > అమెరికాకు తాకిన డీప్‌ఫేక్ సెగ..ఆందోళన వ్యక్తం చేసిన బైడెన్

అమెరికాకు తాకిన డీప్‌ఫేక్ సెగ..ఆందోళన వ్యక్తం చేసిన బైడెన్

అమెరికాకు తాకిన డీప్‌ఫేక్ సెగ..ఆందోళన వ్యక్తం చేసిన బైడెన్
X

సినీ నటి రష్మిక మందన్నా డీప్‌ఫేక్‌ వీడియో వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. టెక్నాలజీ దుర్వినియోగంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది, ప్రముఖ క్రికెటర్ సచిన్, రియల్ హీరో సోనూసూద్ అనేక మంది సెలబ్రటీలు డీప్‌ఫేక్ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాలో డీప్ ఫేక్ కలకలం సృష్టిస్తోంది. ఆ సెగ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రముఖ గాయని టేలర్‌ స్విఫ్ట్‌ను తాకింది. బైడెన్‌ వాయిస్ అనుకరిస్తూ ముందుగానే రికార్డ్‌ చేసిన ఫోన్‌కాల్స్‌ గాయనికి చెందిన అభ్యంతరకర దృశ్యాలపై వైట్‌హౌస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంవత్సర చివర్లో జరగనున్న అధ్యక్ష ఎలక్షన్‌‌కు అభ్యర్థిత్వం కోసం ప్రస్తుతం ప్రైమరీ పోల్స్‌ జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే గత వారం న్యూహాంప్‌షైర్‌లో ప్రైమరీ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి ఓటర్లకు బైడన్‌ చెప్పినట్టుగా ముందుగా రికార్డు చేసిన కొన్ని ఫోన్‌ కాల్స్ వచ్చాయి. ఈ ఎన్నికలో ఓటు వేయొద్దని ఆయన ఓటర్లను కోరినట్లు వాటి సారాంశం. ఈ ఏఐ జనరేటెడ్‌ కాల్స్‌పై ఇప్పటికే అధికారులు చర్యలు ప్రారంభించారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ ఈ సాంకేతికత అభ్యర్థులను కలవరానికి గురి చేస్తోంది. బైడెన్ వాయిస్‌ను అనుకరించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు చిత్రాలు, సమాచార వ్యాప్తిపై మేం తీవ్ర ఆందోళన చెందుతున్నాం. సమస్య పరిష్కారానికి చేయగలిగిందంతా చేస్తాం’ అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ తెలిపారు. డీప్‌ఫేక్‌ వీడియోపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ప్రముఖులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated : 27 Jan 2024 12:43 PM IST
Tags:    
Next Story
Share it
Top