joe biden : డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో బైడెన్ ఘన విజయం
X
డెమోక్రటిక్ ఎన్నికల్లో పార్టీ తరపున అభ్యర్థిత్వల కోసం ప్రైమరీ ఎన్నికలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తొలి విజయం సాధించాడు. అగ్రరాజ్యంలో ఈ సంవత్సరం అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార డెమోక్రటిక్ పార్టీ, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాల కోసం ప్రైమరీ ఎన్నికలు జరుగుతున్నాయి. సౌత్ కరోలినా డెమోక్రాటిక్ ప్రైమరీ ఎన్నికల్లో అధ్యక్షుడు జో బైడెన్ ఘన విజయం సాధించారు. బెడైన్‌కు ఇద్దరు అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ చివరికి ఆయనే గెలిచారు. దాదాపు 55 మంది డెలిగేట్‌లు ఈ పోటీలో ఉన్నప్పటికీ తొలి నుంచి బైడెన్‌దే విజయమని అంతా భావించారు. అంతా అనుకున్నట్టుగానే బైడెన్ విజయం సాధించాడు. ఈ పోటీలో మారియన్ విలియమ్సన్, డీన్ ఫిలిప్స్‌లు బైడెన్‌కు గట్టి పోటీ ఇచ్చారు. సౌత్ కరోలినా ప్రైమరీలో గెలుపు సమయంలో బైడెన్ లాస్ ఏంజెల్స్‌లో నిధుల సేకరణ కార్యక్రమంలో ఉన్నారు.
దక్షిణ కరోలినాలో రిపబ్లికన్లకు మంచి పట్టుంది. ఇక్కడి ఓటర్లలో 26 శాతం నల్లజాతీయులే. దేశం మొత్తం ఓటర్లలో వీరి వాటా 11 శాతం. ఏపీ ఓట్‌క్యాస్ట్ సర్వే ప్రకారం.. గత ఎన్నికల్లో ప్రతి 10 మంది నల్లజాతీయుల్లో 9 మంది బైడెన్‌కు ఓటేశారని తేలింది. తాజా ప్రైమరీలోనూ బైడెన్ (Joe Biden) గెలుపునకు వారే కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మంగళవారం నెవాడాలో, ఫిబ్రవరి 27న మిషిగన్, మార్చి 5న పలు రాష్ట్రాల్లో డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీలు జరగనున్నాయి. సౌత్ కరోలినాలో విజయంపై బైడెన్ స్పందిస్తూ.. ‘ఎన్నికల ప్రచారానికి సౌత్ కరోలినా ఓటర్లు నూతన జోష్ తీసుకొచ్చారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లోనూ ఓటర్లు మాకు పూర్తి మద్దతు తెలిపారు. ఇప్పుడు కూడా సౌత్ కరోలినా ప్రజలు మరోసారి అదే రకమైన తీర్పునిచ్చారు. ట్రంప్‌ను ఓడించేలా మమ్మల్ని నడిపించారనడంలో ఎలాంటి సందేహం లేదు’ అన్నారు. ఇదిలావుంటే.. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్, బైడెన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అవకాశం ఉన్న ప్రతిసారి విమర్శలు చేసుకుంటున్నారు.