Home > అంతర్జాతీయం > ఛీ ఛీ.. డాక్టర్‌కు ఇదేం పాడు బుద్ధి.. విమానంలో బాలిక ఎదుట అసభ్యకర చేష్టలు..

ఛీ ఛీ.. డాక్టర్‌కు ఇదేం పాడు బుద్ధి.. విమానంలో బాలిక ఎదుట అసభ్యకర చేష్టలు..

ఛీ ఛీ.. డాక్టర్‌కు ఇదేం పాడు బుద్ధి.. విమానంలో బాలిక ఎదుట అసభ్యకర చేష్టలు..
X

విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో బాలిక ఎదుట అసభ్యకర చేష్టలకు పాల్పడిన భారత సంతతి వైద్యుడు సుదీప్త మొహంతి(33)ని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. అనంతరం ఆయన్ను ఫెడరల్‌ న్యాయస్థానంలో ప్రవేశపెట్టి కొన్ని ఆంక్షలు విధిస్తూ విడుదల చేశారు. అమెరికాలో విమానంలో ప్రయాణిస్తూ... బాలిక పక్కనే కూర్చుని దుప్పటి మెడ వరకు కప్పుకుని హస్తప్రయోగం చేసుకున్నాడు ఆ డాక్టర్. ఆ చర్య ఎవరికీ కనిపించకుండా కేవలం ఆ బాలికకు మాత్రమే కనిపించేలా జాగ్రత్త పడ్డాడు. భయంతో వణికిపోయిన ఆ బాలిక ముందు వరుసలోని ఖాళీ సీటులోకి మారింది. ఫ్లైట్ దిగిన తర్వాత అధికారులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని ఎఫ్‌బీఐ అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు ఇండో అమెరికన్ వైద్యుడు కావడం గమనార్హం. ఈ ఘటన గతేడాది మే నెలలో జరిగింది.

హవాయి రాష్ట్రంలోని హొనోలులు నుంచి బోస్టన్‌కు సుదీప్త మొహంతి ఓ మహిళతో కలిసి విమానంలో బయల్దేరాడు. అదే విమానంలో 14 ఏళ్ల బాలిక తన తాత, అమ్మతో ప్రయాణిస్తుంది. బాలిక పక్కనే సీటు కావడంతో అందులో మొహంతి కూర్చున్నాడు. కొద్దిసేపటికి బాలికను అదోరకంగా చూసి దుప్పటిని మెడ వరకు కప్పుకున్నాడు. చేతులు, కాళ్లు కదిలిస్తూ వికృతంగా వ్యవహరించాడు. కొద్దిసేపటికి కదలడం ఆగిపోయింది. ఇదంతా గమనించిన బాలిక అతను హస్తప్రయోగం చేసుకున్నట్టు గమనించింది. వెంటనే ఆమె మరో వరుసలోకి వెళ్లి కూర్చుంది. ఈ విషయాన్ని తనతోపాటే ఉన్న తాత, అమ్మకు ఆ బాలిక చెప్పింది. వారు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తెలియజేశారు. అధికారులు డాక్టర్ సుదీప్త మొహంతిని ప్రశ్నించగా.. తనకేమీ తెలియదన్నట్టుగా తొలుత బుకాయించాడు. ఆధారాలను పరిశీలించిన అధికారులు మొహంతి విమానంలో అసభ్యంగా ప్రవర్తించినట్టు గుర్తించారు. పలుమార్లు విచారించిన తర్వాత అసలు తనకేమీ గుర్తు లేదని ఎఫ్‌బీఐ అధికారులకు మొహంతి చెప్పాడు.

తాజాగా, నిందితుడైన డాక్టర్ సుదీప్త మొహంతిని పోలీసులు గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నేరం నిరూపణైతే 90 రోజుల జైలు, 50 వేల డాలర్లు జరిమానా పడే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ కేసులో బెయిల్ లభించడంతో మొహంతి విడుదలయ్యాడు. అయితే, బెయిల్ కాలంలో మొహంతి 18 ఏళ్లకు తక్కువ వయసున్న వారికి దూరంగా ఉండాలని కోర్టు కండీషన్ పెట్టింది.

Updated : 13 Aug 2023 10:57 AM IST
Tags:    
Next Story
Share it
Top