Home > అంతర్జాతీయం > రెండు కుక్కల్ని చూసుకుంటే రూ. కోటి జీతం

రెండు కుక్కల్ని చూసుకుంటే రూ. కోటి జీతం

రెండు కుక్కల్ని చూసుకుంటే రూ. కోటి జీతం
X

కుక్కల బాగోగులు చూసుకునే పనిమనుషులకు జీతం ఎంత ఉంటుంది? పది వేలో, ఇరవైవేలో, మహా అయితే యాభై వేలు. అంబానీ, అదానీ కుక్కలను చూసేవాళ్లకైతే ఓ లక్ష ఉండొచ్చు. ఎంత మేలుజాతి కుక్కలను, ఎంత బాగా చూసుకున్నా ఏడాది జీతం ఐదారు లక్షలకు మించకపోవచ్చు. కానీ ఏకంగా ఏడాదికి కోటి రూపాయలు ఇస్తామంటూ ఓ కుబేరుడు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తనకున్న రెండు కుక్కలను ప్రాణంగా చూసుకుంటే చాలని, సెలవులు కూడా ఉంటాయని తెలిపాడు. ఓస్.. ఈ పనికే అంత జీతామా, మా జాబ్ మాకే ఇవ్వండి అని అభ్యర్థులు పోటెత్తారు. రెండువేలకుపైగా దరఖాస్తులు రావడంతో ఆఫర్ క్లోజ్ చేసే సరైన అభ్యర్థిని ఎన్నుకునే పనిలో పడ్డారు.

లండన్‌కు చెందిన ఓ షావుకారు ఇచ్చిన ఆఫర్ ఇది. అతని తరుఫున జార్జ్ రాల్ఫ్-డన్, ఫెయిర్‌ఫాక్స్ అనే వ్యక్తి రిక్రూట్ చేపట్టాడు. కుక్కల బాగోగులు చూసుకునే ఈ ‘డాగ్ నానీ’ జాబ్‌ దక్కించుకునే వ్యక్తికి ఏడాదికి లక్షల పౌండ్లు (రూ. కోటికి పైగా) జీతం ఇస్తారు. ఏడాది ఆరు వారాలు సెలవులతోపాటు ఆ కుక్కలతో కలిసి విమానాలు చేయొచ్చు, ఖరీదైన హోటళ్లలోనూ ఉండొచ్చు. కాకాపోతే కుక్కల గురించి బాగా తెలిసిన వారే అప్లయ్ చేసుకోవాలని చెప్పారు. వాటికి ఏ తిండి ఇష్టం, అవి ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తాయి? వాటికి జబ్బుచేస్తే ఏం చేయాలి వంటి విషయాలపై అవగాహన, అనుభవం, నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. అప్లయ్ చేసుకున్నవాళ్లలో లాయర్లు, ఉన్నత విద్యావంతులు, ఇప్పటికే మంచి జీతాలు పొందుతున్నవాళ్లు కూడా ఉన్నట్లు ఆఫర్ కింద పెట్టిన కామెంట్లతో తెలుస్తోంది.

Updated : 29 Jun 2023 2:21 PM IST
Tags:    
Next Story
Share it
Top