Home > అంతర్జాతీయం > జెట్ప్యాక్తో పిజ్జా డెలివరీ.. ఎక్కడంటే..?

జెట్ప్యాక్తో పిజ్జా డెలివరీ.. ఎక్కడంటే..?

జెట్ప్యాక్తో పిజ్జా డెలివరీ.. ఎక్కడంటే..?
X

ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఓ వ్యక్తి జెట్ ప్యాక్ వేసుకుని ఎగురుతుంటాడు. అది చూసిన వాళ్లంతా.. మార్వెల్ సినిమాలో ఏదో సీన్ అయి ఉంటుందిలే అనుకున్నారు. తీరా చూస్తే.. అది ఒక పిజ్జా డెలివరీ బాయ్ అని షాక్ తిన్నారు. అవును అది డెలివరీ బాయే. ఫుడ్ డెలివరీ చేయడానికి సైకిల్స్, బైక్స్.. చివరికి డ్రోన్స్ కూడా వాడారు. ప్రస్తుతం ట్రెండ్ తో పాటు.. టెక్నాలజీ కూడా మారింది. ఏకంగా ఓ వ్యక్తి జెట్ ప్యాక్ ద్వారా ఎగురుతూ.. ఫుడ్ డెలివరీ చేసే స్థాయికి ఎదిగింది. తాజాగా డోమినోస్ సంస్థ ఈ సిస్టమ్ ను ప్రవేశపెట్టింది. ఈ సంస్థ విడుదల చేసిన వీడియోలో డెలివరీ బాయ్ జెట్ ప్యాక్ వేసుకుని, ఎగురుకుంటూ వెళ్లి కొండపై ఉన్నవాళ్లకు డెలివరీ చేస్తాడు.





డోమినోస్ ఈ జెట్ ప్యాక్ సిస్టమ్ ను యూకేలో ప్రవేశపెట్టింది. బ్రిటన్‌లో గ్లాస్టన్‌బరీ ఫెస్టివల్‌ సందర్భంగా.. పిజ్జా లవర్స్ కు దీన్ని పరిచయం చేసింది. కొండపై క్యాపు వేసుకుని ఉన్న కస్టమర్స్ కు గాల్లో ఎగురుతూ వచ్చి డోమినోస్‌ ఆర్డర్స్ అందిస్తున్నారు. అదిచూసిన కస్టమర్లు మొదట భయపడ్డా.. అది డెలివరీ బాయ్ అని తెలిసి ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో యూకే డోమినోస్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పంచుకుంది. వీడియో చూసిన నెటిజన్స్ ‘ఇది నిజమా లేద ప్రాంక్ చేస్తున్నారా’అని, ‘ఇది నిజంగా అద్భుతం’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.











Updated : 1 July 2023 5:51 PM IST
Tags:    
Next Story
Share it
Top