అమెరికా మాజీ అధ్యక్షుడి అరెస్ట్.. జైలుకెళ్లిన ట్రంప్..
X
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు అయ్యారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో జార్జియా ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర కేసుల్లో ఆయన పోలీసుల ముందు లొంగిపోయారు. అట్లాంటాలో ఫుల్టన్ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయారు. 2లక్షల డాలర్ల విలువైన బాండ్ సమర్పించి బెయిల్ తీసుకోవచ్చని అట్లాంటా ఫుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ అటార్నీ ఫాని విల్లీస్ స్పష్టం చేశారు. దీంతో ఈ ప్రాసెస్ పూర్తి చేసేందుకు ట్రంప్ జైలు వద్దకు వెళ్లారు.
జార్జియా జైలులో ట్రంప్ దాదాపు 20 నిమిషాలు గడిపారు. అనంతరం బెయిల్ ప్రక్రియ పూర్తికావడంతో బయటకు వచ్చారు. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు స్వయంగా పోలీసుల ముందు లొంగిపోయినా దాన్ని అరెస్ట్ కిందే పరిగణిస్తారు. ఇదిలా ఉంటే తనపై తప్పుడు కేసులు పెట్టారని, ఆరోపణలన్నీ అవాస్తవాలని ట్రంప్ అంటున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ట్రంప్ న్యూజెర్సీలోని తన గోల్ఫ్ క్లబ్ కు వెళ్లిపోయారు.