Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. 2వేలు దాటిన మృతుల సంఖ్య
X
భారీ భూకంపంతో ఆఫ్ఘానిస్తాన్ గజగజ వణికిపోయింది. 6.3 తీవ్రతతో వచ్చిన భూకంపం ఆఫ్ఘాన్ పశ్చిమ ప్రాంతంలో విధ్వంసం సృష్టించాయి. దీంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ విపత్తులో సుమారు 2వేలకు మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి.
ఆఫ్ఘాన్లోని హెరాత్ ప్రావీన్స్లో శనివారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం సమయంలోనే భూమి 5సార్లు కంపించింది. రిక్టర్ స్కేలుపై వరుసగా 5.5, 4.7. 6.3, 5.9, 4.6 తీవ్రత నమోదైంది. ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ విపత్తులో ఇప్పటివరకు 2వేల మంది మరణించగా.. వేల మంది నిరాశ్రయులు అయ్యారు. హెరాత్ జిల్లాలో నాలుగు గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
భూకంపం సంభవించిన వెంటనే ఆఫ్ఘాన్ విపత్తు నిర్వహణ సంస్థ రంగంలోకి దిగి రెస్క్యూ చేపట్టింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో భూకంప దృశ్యాలు, అక్కడి ప్రజల దుస్థితి అందరినీ కలిచివేస్తున్నాయి. కాగా గత ఏడాది ఆప్ఘనిస్తాన్‌లో 5.9 తీవ్రతో భూమి కంపించినప్పుడు 1000 మందికి పైగా మరణించారు. ఈసారి తీవ్రత ఇంకాస్త ఎక్కువగానే ఉంది.హెరాత్ ప్రావిన్స్‌లో 19 లక్షల మంది నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి.