డజన్ గుడ్లు 390.. కొనాలంటే జంకుతున్న జనం..
X
పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతోంది. రోజురోజుకు పరిస్థితులు దిగజారిపోతున్నాయి. చాలా మందికి తినడానికి తిండి కూడా దొరకడం లేదు. ఇక నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గుడ్డు కొనాలన్నా అక్కడి జనం జంకుతున్నారు. ఎందుకంటే ఒక్క గుడ్డు ధర రూ. 32కు చేరింది. డజన్ గుడ్లను రూ.360కి విక్రయించాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ వ్యాపారులు మాత్రం రూ. 380కిపైనే అమ్ముతున్నారు. దీంతో గుడ్డు జోలికి వెళ్లడానికే అక్కడి ప్రజలు భయపడిపోతున్నారు.
ఇక 30 డజన్ల గుడ్ల ధర రూ. 10,500 నుంచి రూ. 12,500కు చేరుకుంది. దీంతో జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలతో తిండి లేక చనిపోతున్నామంటూ పాక్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుఎస్ డాలర్‌తో పోలిస్తే పాక్ రూపాయి విలువ క్షీణించడం.. ఇంధన ఖర్చులు పెరగడం వల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని ఆల్ పాకిస్తాన్ బిజినెస్ ఫోరమ్ తెలిపింది. ద్రవ్యోల్బణం పెరుగుదల కొనసాగుతోందని చెప్పింది. సోయాబీన్స్ దిగుమతికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ.. ఇంకా నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. పౌల్ట్రీ ఫీడ్లో సోయాబీన్ను ఉపయోగిస్తారు. ఒకవేళ సోయాబీన్స్ను దిగుమతి పెరిగితే గుడ్డు ధర తగ్గే అవకాశం ఉంటుంది.