Home > అంతర్జాతీయం > గూడచర్యం కేసు.. ఇండియన్ నేవీ మాజీ అధికారులకు మరణ శిక్ష

గూడచర్యం కేసు.. ఇండియన్ నేవీ మాజీ అధికారులకు మరణ శిక్ష

గూడచర్యం కేసు.. ఇండియన్ నేవీ మాజీ అధికారులకు మరణ శిక్ష
X

ఖతార్ నిర్బంధంలో ఉన్న భారత్‌కు చెందిన 8 మంది ఇండియన్ నేవీ మాజీ అధికారులకు అక్కడి కోర్టు మరణ శిక్ష విధించింది. గూఢచర్యం ఆరోపణలు రుజువుకావడంతో ఈ శిక్ష వేసినట్లు సమాచారం. శిక్షపడిన వారిలో కెప్టెన్ నవ్ తేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్ పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా సైలర్ రాగేష్ ఉన్నారు.

8 మందికి ఉరిశిక్ష విధిస్తూ ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పుపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని దీనిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేసింది. తీర్పునకు సంబంధించి పూర్తి సమాచారం అందిన వెంటనే చర్యలు ప్రారంభిస్తామని విదేశాంగ శాఖ ప్రకటించింది. బాధితుల కుటుంబ సభ్యులతో టచ్లో ఉన్నట్లు అధికారులు చెప్పారు.

భారత్‌కు చెందిన 8మంది నౌకాదళ మాజీ అధికారులు ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ ఇచ్చే అల్‌ దహ్రా సంస్థలో పనిచేస్తున్నారు. ఒమన్‌కు చెందిన ఓ మాజీ వైమానిక దళం అధికారి ఈ సంస్థను నిర్వహిస్తున్నారు. అయితే 2022 ఆగస్టులో భారత్‌కు చెందిన ఈ 8 మందిని సబ్‌మెరైన్‌ కార్యకలాపాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో 8 మంది భారత విదేశాంగ శాఖ అధికారులను కలవడంతో పాటు ఖతార్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు.

గూఢచర్యం కేసులో అరెస్టైన 8 మంది పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించారు. అయినా ఫలితం దక్కలేదు. తాజాగా ఈ కేసు విచారణ పూర్తి చేసిన ఖతార్ న్యాయస్థానం వారందరికీ మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.




Updated : 26 Oct 2023 12:51 PM GMT
Tags:    
Next Story
Share it
Top