Home > అంతర్జాతీయం > ఇక మీద మరుగుడే.....ఐరాస ఆందోళన

ఇక మీద మరుగుడే.....ఐరాస ఆందోళన

ఇక మీద మరుగుడే.....ఐరాస ఆందోళన
X

వాతావరణం, పర్యావరణం మార్పుల మీద ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జులై నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని శాస్త్రవేత్తలు ప్రకటించింది. దీని గురించి మాట్లాడుతూ గ్లోబల్ వార్మింగ్ యుగం ముగిసిందని....ఇక మరగడమే మిగిలింది ప్రపంచానికి అంటూ వ్యాఖ్యలు చేసారు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్.

జులై నెలలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భూమి చాలా వేడెక్కిపోయింది. ఇక మీదట సలసల మరగడమే అన్నారు గుటెర్రెస్. ఎరా ఆఫ్ గ్లోబల్ బాయిలింగ్ లోకి వచ్చేశాం అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్ళు గ్లోబల్ వార్మింగ్ గురించి వర్రీ అయ్యాం...ఇక దాని గురించి ఆలోచించక్కర్లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మాటలు అన్నారు గుటెర్రెస్.

భూమికి ఉత్తరం వైపు నమోదవుతున్న తీవ్రమైన వేడి.....చాలా క్రూరంగా ఉందని అన్నారు గుటెర్రెస్. వాతావరణంలో ఊహించని రీతిలో మార్పులు జరిగాయి. అది కూడా చాలా వేగంగా జరిగిందని ఆయన అభిప్రాయడ్డారు. ఇది చాలా భయంకరమైన పరిణామం అని చెబుతున్నారు. ఇప్పుడు హెచ్చరికలతో కాలం వెళ్ళదని...తొందరగా చర్యలు తీసుకోవాల్సిందేనని గుటెర్రస్ ప్రపంచనేతలకు పిలుపునిచ్చారు.


Updated : 28 July 2023 5:20 AM GMT
Tags:    
Next Story
Share it
Top