Home > అంతర్జాతీయం > టెస్లా షేర్లు భారీ పతనం... కరిగిపోయిన ఎలాన్ మస్క్ సంపద

టెస్లా షేర్లు భారీ పతనం... కరిగిపోయిన ఎలాన్ మస్క్ సంపద

టెస్లా షేర్లు భారీ పతనం... కరిగిపోయిన ఎలాన్ మస్క్ సంపద
X

వరల్డ్ రిచ్చెస్ట్...ఎలాన్ మస్క్ కు తన ఓన్ కంపెనీ టెస్లానే పెద్ద షాక్ ఇచ్చింది. ఒక్కరోజులోనే 1.64 లక్షల కోట్ల నష్టం చవిచూసింది. ఆ కంపెనీ షేర్లు భారీగా పతనం పొందాయి. అయినా కూడా ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నారు.

ఎలక్ట్రిక్ వాహనాల్లో టాప్ గా ఉన్న టెస్లా ధరలను మరింత తగ్గించాలని ఆ కంపెనీ అనుకుంది. దాన్నే ప్రకటించింది. వడ్డీరేట్లు ఎక్కువగా ఉన్నాయని అందుకే టెస్లా కార్ల ధరలను మరింత తగ్గించక తప్పదని మస్క్ తెలిపారు. దీంతో గురువారం నాటి అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేర్ల ధర భారీగా పడిపోయింది. ఏకంగా 9.7 శాతానికి కుంగిపోయింది. దీనివలన మస్క్ సంపదలో 20.3 బిలియన్ డాలర్లు ఎగిరిపోయాయి. దీంతో ఎలాన్ మస్క్ సంపద 234.4 బిలియన్ డాలర్లకు తగ్గింది.




అయితే ఇంత జరిగినా కూడా మస్క్ ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటిస్థానాన్ని మాత్రం కోల్పోలేదు. ఎందుకంటే ఇతని తర్వాత ఉన్న ఫ్రెంచ్ బిజినెస్ మాన్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ షేర్లు కూడా జూన్ లో భారీగా పతనమయ్యాయి. దాంతో అతని సంపద కూడా తగ్గిపోయింది. అందుకే ఎలాన్ మస్క్ షేర్లు పతనం అయినా, డబ్బులు పోయినా కూడా అతనే నంబర్ వన్ లో కొనసాగుతున్నాడు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్ లెక్కల ప్రకారం బెర్నార్డ్ కంటే మస్క్ సంపద 33 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉంది.


Updated : 21 July 2023 7:39 AM GMT
Tags:    
Next Story
Share it
Top