Home > అంతర్జాతీయం > నీ ఇంటికొస్తా, దుమ్ముంటే కొట్లాడు బే.. జుకర్‌బర్గ్‌కు మస్క్ సవాల్..

నీ ఇంటికొస్తా, దుమ్ముంటే కొట్లాడు బే.. జుకర్‌బర్గ్‌కు మస్క్ సవాల్..

నీ ఇంటికొస్తా, దుమ్ముంటే కొట్లాడు బే.. జుకర్‌బర్గ్‌కు మస్క్ సవాల్..
X

వీధి రౌడీలు ‘ఏంరా సాలే, బే, బాడ్కవ్, గుండెల్లో దమ్ముంటే రాబే’ అని తిట్టుకుంటారు. సెలబ్రిటీలు ఇలాంటి తిట్లనే కాస్త నాజూగ్గా తిట్టుకుంటుంటారు. అలగా జనాలది లొల్లి, పెద్దోళ్లు కొట్టుకుంటే ఫైట్. ఇంకా స్టయిల్‌గా చెప్పుకోవాలలంటే కేజ్ ఫైట్. రెండు సోషల్ మీడియా దిగ్గజాల అధిపతుల మధ్య ‘కేజ్ ఫైట్’ కోసం లోకం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. వాళ్లు ఫైట్ చేసుకుంటారో లేదో పక్కాగా తెలియకపోయినా రోజూ అల్లరే అల్లరి. వాళ్లెవరో కొందరికి ఈపాటికే తెలిసి ఉంటుంది. ట్విటర్ అధిపతి ఎలన్ మస్క్, ఫేస్‌బుక్ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్‌ల కేజ్ ఫైట్‌కు ఇంకా ముహూర్తం కుదరలేదు. మస్క్ ఎంత కవ్విస్తున్నా మెటా బాస్ కాస్త నెమ్మదిగానే స్పందిస్తున్నాడు. ఫైట్‌కు సిద్ధమని డేట్స్ ఇవ్వాలని అంటున్నాడు. మస్క్ డేట్స్ చెప్పకుండా మళ్లీ రెచ్చగొట్టే ట్వీట్లు చేశాడు. ‘మీ ఊరికొస్తా, నీ నట్టింటికొస్తా ఫైట్‌కు రెడీనా’’ అని సవాల్ విసిరాడు.

‘‘ఈ రోజు రాత్రి నా టెస్లా కారును పాలో ఆల్టోలోని జుకర్‌బర్గ్ ఇంటికి తీసుకెళ్లమని చెప్తాను. అలాగే ట్విట్టర్లో లైవ్ స్ట్రీమింగ్‌ను కూడా టెస్ట్ చేద్దాం. జుకర్‌‌బర్గ్ నా కోసం డోర్ ఓపెన్ చేస్తే మీరు మా ఫైట్‌ను చూడొచ్చు” అని ఓ ట్వీట్ వదిలాడు. దీనికి జుకర్‌బర్గ్ తరఫున మెటా కంపెనీ స్పందించాడు. ‘‘జుకర్‌బర్గ్ ఇంట్లో లేరు. ముందుగా అనుకున్న పనిపై వెళ్తున్నారు” అని అన్నారు. మస్క్ అంతటితో ఊరుకోకుండా మళ్లీ కవ్వించాడు. తనకు భయపడి పారిపోయాడని అన్నాడు. ‘‘నేను ట్వీట్ చేశాక జుకర్‌‌బర్గ్ హడావుడిగా బ్యాగ్‌లు ప్యాక్ చేసుకుని ఎక్కడికో వెళ్తున్నట్టున్నాడు” అని ఎద్దేవా చేశాడు. వీరిద్దరివీ టైమ్ పాస్ కబుర్లని, ఫైట్ చేసుకునే దమ్ములేనని జనం కామెంటుతున్నారు.

Updated : 15 Aug 2023 2:52 PM IST
Tags:    
Next Story
Share it
Top