Elon Musk : బూతుపేరు పెట్టుకుంటే రూ. 8,316 కోట్లు ఇస్తా.. మస్క్ ఆఫర్
X
ట్విటర్‌ను కొనుక్కుని ఆగమాగం చేసిన ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కన్ను వికీపీడియాపై పడింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ఉచితంగా సమాచారం అందిస్తున్న వికీపీడియాను ఎగతాళి చూస్తే పచ్చిబూతు మాట అన్నాడు. వికీపీడియాను ఓపెన్ చేయగానే విరాళాలు ఇవ్వండన్న ప్రకటన కనిపిస్తుండడంతో మస్క్ మామకు చిర్రెత్తింది. వికీపీడియా పేరును ‘డికీపీడియా’గా మార్చుకుంటే వంద కోట్ల డాలర్లు (రూ. 8,316 కోట్లు) ఆ సంస్థకు ఇస్తానని మస్క్ ట్వీట్ చేశాడు. దానికి గురకపెడుతున్న ఎమోజీని కూడా జతచేశాడు. ‘వికీపీడియా ఎందుకు డబ్బు అడుగుతోంది? వికీమీడియా ఫౌండేషన్‌కు అంతేసి డబ్బో ఏం పని అని ము ఎప్పుడైనా ఆలోచించారా? వికీని నడపడానికి అంత ఖర్చు అక్కర్లేదు. మరి ఎందుకు అంత డబ్బు అడుగుతున్నారు?’’ అని మస్క్ ప్రశ్నించాడు.
డికీపీడియా పచ్చి బూతుమాట కావడంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. డబ్బు ఉంది కదా అని మిడిసిపడకూడదని నెటిజన్లు తిడుతున్నారు. కేవలం విరాళాలపైనే ఆధారపడి విలువైన సమాచారన్ని ప్రజలకు అందిస్తున్న వికీపీడియాను ఆదుకోవాల్సింది పోయి గేలి చేయడం సరికదాని అంటున్నారు. మస్క్ ప్రతిపాదన బాగే ఉందని, వికీపీడియా కొన్ని రోజులు పేరు మార్చుకుంటే సరిపోతుందని మరికొందరు అంటున్నారు. ఆ ఎత్తుడగను పసిగట్టిన మస్క్ ‘‘నేనేమైనా తెలివితక్కువవాడినా.. డికీపీడియా పేరు కనీసం ఏడాదిపాటు కొనసాగాలి’’ అని అన్నాడు.