ట్విట్టర్‌కు పోటీగా మార్క్ జుకర్‌బర్గ్ 'థ్రెడ్స్'
X
మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా అనగానే ఠక్కున గుర్తొచ్చే ప్లాట్‌ఫాం ట్విట్టర్(Twitter). సినీ, రాజకీయ సెలబ్రిటీల నుంచి సామాన్యుల సైతం ఈ మైక్రో బ్లాగ్ లో ఇంపార్టెంట్ అప్డేట్స్ పోస్ట్ చేస్తుంటారు. ఇటీవలే ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్... ట్వీట్స్‌ను చూడటంలో వినియోగదారులకు పరిమితులు విధించిన సంగతి తెలిసిందే. వెరిఫైడ్, అన్‌వెరిఫైడ్, కొత్త అన్‌వెరిఫైడ్ ఖాతాదారులకు వేర్వేరుగా లిమిట్ ఇచ్చారు. ఈ విషయాన్ని పక్కన బెడితే...ట్విట్టర్ పోటీగా సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) మరొక మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘థ్రెడ్స్’ (Threads) పేరుతో లాంచ్ చేసిన ఈ సరికొత్త యాప్ గురువారం యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా తీసుకొచ్చిన ఈ కొత్త టెక్స్ట్-బేస్డ్ థ్రెడ్స్ యాప్ ట్విట్టర్‌కు బలమైన పోటీ ఇస్తుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ట్విట్టర్‌కు పోటీగా వచ్చిన ఈ థ్రెడ్స్ యాప్ పై నెటీజన్లు తమ విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓ నెటీజన్ ఇందుకు సంబంధించి ఓ నెటీజన్ వ్యంగంగా ట్వీట్ చేశాడు. థ్రెడ్స్ యాప్‌ను మెటా సంస్థ కేవలం కీబోర్డులోని Crl,C,V లతో అందుబాటులోకి తెచ్చేందని ట్వీట్ చేశాడు. అంటే కాపీ, పెస్ట్ చేసి ఈ యాప్ తీసుకొచ్చారని ఈ ట్వీట్‌లోని సారాంశం. ఈ ట్వీట్‌పై ఎలాన్ మస్క్ స్పందిస్తూ... నవ్వుతున్న ఎమోజీనికి పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది. ఇదిలా ఉండగా థ్రెడ్స్ యాప్‌ను ప్రారంభించిన మొదటి రెండు గంట్లలోనే దాదాపు 20 లక్షల మంది ఈ అకౌంట్లను తెరిచారు. ఆ తర్వాత తొలి నాలుగు గంటలకు ఈ సంఖ్య సుమారు 50 లక్షల వరకు పెరిగింది. ఈ విషయాన్ని మెటా సీఈవో మార్క్ జూకర్ బర్గ్ తెలిపారు. అయితే ఈ యాప్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వినియోగించి లాగిన్ చేసుకోవచ్చు. యాప్‌ను యాపిల్ స్టోర్ నుంచి సైతం ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో వర్డ్స్, లింక్స్, ఫోటోలు, 5 నిమిషాల నిడివి ఉన్న వీడియోలు కూడా పోస్టు చేయవచ్చు.
Meta's new app was built entirely using this keyboard: pic.twitter.com/RoRe6szEO0
— DogeDesigner (@cb_doge) July 6, 2023