Elon Musk : ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. ఆ గ్రహంపైకి ఒకేసారి 10 లక్షల మంది!
X
(Elon Musk) టెస్లా, ఎక్స్ కంపెనీల అధినేత, ప్రముఖ బిలినియర్ ఎలాన్ మస్క్ మరో కీలక ప్రకటన చేశారు. అంగారక గ్రహంపైకి 10 లక్షల మంది ప్రజలను తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. పది లక్షల మందిని ఆ గ్రహంపైకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేసినట్లుగా తెలిపారు. సోషల్ మీడియా వేదిక ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అంగారక గ్రహంపైకి వెళ్లి అక్కడ అనేక పరిశోధనలు చేసే రోజు త్వరలోనే వస్తుందని, అందుకోసం పది లక్షల మంది ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరారు.
అంగారక గ్రహంపై నివశించేందుకు చాలా పనులు చేయాల్సి ఉందన్నారు. ఎక్స్ వేదికగా ఓ యూజర్ అంగారక గ్రహంపై మాట్లాడాడు. స్టార్ షిప్ అనేది అతిపెద్ద రాకెట్ అని, అది అంగారక గ్రహం పైకి మనుషులను తీసుకెళ్లేందుకు తయారు చేస్తున్నదని అన్నారు. ఆ యూజర్ పోస్టుకు ఎలాన్ మస్క్ స్పందించారు. అంగారకుడిపైకి వెళ్లే స్టార్‌షిప్‌ను త్వరలోనే ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లినట్లుగానే ఒక రోజు పది లక్షల మంది మార్స్ గ్రహం పైకి వెళ్లే ట్రిప్ ఉంటుందని అన్నారు.