Home > అంతర్జాతీయం > బాబ్బాబు మీకు పుణ్యం ఉంటుంది మా దగ్గరకు రాకండి

బాబ్బాబు మీకు పుణ్యం ఉంటుంది మా దగ్గరకు రాకండి

బాబ్బాబు మీకు పుణ్యం ఉంటుంది మా దగ్గరకు రాకండి
X

దేశాలను ఆర్ధికాభివృద్ధి చేయడంలో టూరిజం ఫస్ట్ ఉంటుంది. అందుకే ప్రతీ దేశం మా దగ్గర కు రండి అంటూ ఆహ్వానాలు పలుకుతాయి. టూరిస్టు వీసాలను పిలిచి మరీ ఇస్తాయి. కానీ ఐరోపా మాత్రం మీకో దండం సామీ మా దగ్గరకు దయచేసి రాకండి అంటోంది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది అక్షరాలా సత్యం. ఎందుకో తెలుసా....

ఐరోపా...కొన్ని దేశాల సమాహారం. తిరగడానికి డబ్బులు, ఓపిక ఉండాలే కానీ ఏళ్ళ తరబడి చూడ్డానికి ప్రదేశాలు ఉన్న ఖండం. ఇక్కడ ప్రతీ దేశ ఒక అద్భుతమే. అందుకే ఈ దేశాలను చూడ్డానికి జనాలు విపరీతంగా వెళుతుంటారు. అదే ఇప్పుడు వాళ్ళకు పెద్ద సమస్య అయిపోయింది. దానికి కారణం అక్కడ ఉంటున్న జనాభా కన్నా ఇలా టూరిజం కోసం వచ్చినవాళ్ళే ఎక్కువైపోతున్నారు. అతి సర్వత్ర వర్జయేత్ అనేది ఏ విషయంలో అయినా...ఏ రంగంలో అయినా నిజం.

టూరిస్ట్ ప్రదేశాలు ఉన్న చోట అక్కడి స్థానికులు కూడా ఉంటారు కాబట్టి...ఇలా టూరిజం ఎక్కువై పోతుండడంతో వారికి సమస్యలు మొదలయ్యాయి. తమ సొంత ప్లేసెస్ లో తామే పరాయివాళ్ళు అయిపోతున్నామన్న భావన కలుగుతోంది. ఇళ్ళు, హోటళ్ళు, ఆసుపత్రులు, ఎయిర్ పోర్ట్ లు ఇలా ఒకటేమిటి అన్నీ టూరిస్టులతో కిక్కిరిసిపోతుంటే స్థానికులకు ఊపిరి ఆడడం లేదు. రోడ్డు రద్దీగా మారిపోతున్నాయి...ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి. అపరిశుభ్రవాతావరణానికి అయితే అంతే లేకుండా పోతోంది. ఆదాయం పెరుగుతున్నా...జీవనం దుర్భరంగా అయిపోతోంది. ఎంత బడ్డు ఉండి ఏం లాభం ప్రశాంతత లేనప్పుడు అన్నట్టు తయారయ్యింది అక్కడి వారి పరిస్థితి. అందుకే ఇప్పుడు వద్దు మహాప్రభో మా దేశాలకు టూరిజానికి రాకండి అంటూ మొరపెట్టుకుంటున్నారు.

ఈ పరిస్థితి ప్రభుత్వాలకూ ఇబ్బందిగా మారింది. అందుకే టూరిజం నిషేధించడానికి బదులు కట్టడి చేస్తున్నారు. విదేశీ పర్యాటకులకు అనుమతులు తక్కువ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రతీ చోటా ప్రవేశ రుసుమును పెట్టారు. అది ఎలాంటిది అయినా, ఎంత చిన్నది అయినా కూడా. అంతే కాదు... వెనీస్ లాంటి దేశాల్లో ఏ ప్రదేశ చూడాలన్నా రోజుకు ఇంత మందికే అనుమతి అంటూ స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేస్తున్నారు. బీచ్ లలో, సిటీల్లో ఉండటానికి కాలవ్యవధిని నిర్ధారిస్తున్నారు. ఎక్కువ టైమ్ ఉంటే జరిమానాలు వేస్తున్నారు. అంతెందుకు సెల్ఫీ దిగడాన్ని కూడా అనుమతించడం లేదు. అయితే డబ్బులు కట్టాలి. అది కూడా నిర్దేశించిన టైమ్ వరకే. అంతకు మించి ఉంటే ఫైన్ తప్పుదు...అంత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేశాయి ఐరోపా దేశాలు. ఇలాంటి రూల్స్ చాలావాటికి అమలు అవుతున్నాయి అక్కడ. చిన్న చిన్న వాటికి కూడా...ఎంతలా అంటే సముద్రపై ఇసుతో చిన్న పిల్లలు కట్టుకునే ఇసుక గూళ్ళతో సహా. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు పాపం ఆ దేశాలు పర్యాటకంతో ఎంత విసిగిపోయాయో. ఎంత టార్చర్ అనుభవించారో.

ఇక మరోవైపు అమెరికా మీద కూడా ఆంక్షలు విధించడానికి సిద్ధమైపోయింది ఐరోపా. మామూలుగా అయితే అమెరికా వీసా ఉంటే ఐరోపా దేశాలు వెళ్ళడానికి అదనపు వీసా అక్కరల్ేదు. కానీ ఇప్పుడు అమెరికాతో పాటూ మరికొన్ని దేశాలకు కూడా పర్యాటక ఫీజు తీసుకోవాలని డెసిషన్ తీసుకున్నాయి. అంతేకాదు ఐరోపా దేశాలు వెళ్ళాలంటే ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. దాన్ని వాళ్ళు అనుమతిస్తేను వెళ్ళగలం లేకపోతే లేదు అన్నట్టు. పాపం ఇలా ఐరోపా టూరిజాన్ని వదిలేసుకోలేక, అనుమతించలేక నానా అవస్థలు పడుతోంది.

ఐరోపా దేశాలలో టూరిజానికి వచ్చే వారి సంఖ్య చూస్తే వారి బాధలు ఎవరికైనా అర్ధం అవుతాయి. అక్కడ చాలా ముఖ్యమైన ప్రదేశాల్లో ఏటా వచ్చే టూరిస్టుల సంఖ్య ఇలా ఉంది. ఆమ్ స్టర్ డ్యామ్ జనాభా 8.5 లక్షలు అయితే, టూరిస్టుల సంఖ్య ఏడాదికి 2.52 కోట్లు. అలాగే బార్సిలోనా జనాభా 16 లక్షలు, పర్యాటకులు 3 కోట్లు. ఇక ఇటలీలోని ఫ్లోరెన్స్ జనాభా 3.8 లక్షలు కానీ టూరిస్టులు ఏడాదికి 2 కోట్లు. చూశారుగా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. అందుకే మేమే ఈ నిర్ణయాలు తీసుకున్నాము అంటున్నాయి ఐరోపా దేశాలు.



Updated : 29 Aug 2023 7:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top