Home > అంతర్జాతీయం > అమెరికాను ముంచెత్తిన వరద..న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ

అమెరికాను ముంచెత్తిన వరద..న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ

అమెరికాను ముంచెత్తిన వరద..న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ
X

రికార్డ్ బ్రేకింగ్ వర్షాలు అమెరికాను ముంచెత్తుతున్నాయి. ఈశాన్యరాష్ట్రాలల్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా దేశ ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగరమంతా జలమయమైంది. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కడుపుతున్నారు. దీంతో గవర్నర్ క్యాథి హోచుల్‌ న్యూయార్క్‎లో ఎమెర్జెన్సీని విధించారు.

అమెరికాలో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరద ఉధృతి పెరిగి అమెరికాను అతలాకుతలం చేస్తోంది. వరద నీరు పెద్దఎత్తున చేరడంతో రోడ్లు, సబ్‌వే స్టేషన్లు చెరువులను తలపిస్తున్నాయి. జాన్ ఎఫ్. కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఎనిమిది అంగుళాల మేర వరదనీరు వచ్చి చేరింది. దీంతో వాటిని టెంపరరీగా అధికారులు మూసివేశారు. పలు రైళ్లను నిలిపివేశారు. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశముందని అమెరికా జాతీయ వాతావరణ శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రజలను కోరారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. కుండపోతగా కురుస్తున్న ఈ భారీ వర్షాలు రెండు సంవత్సరాల క్రితం వచ్చిన హరికేన్ ఇడాను గుర్తు చేస్తోంది. ఇది ఈశాన్య రాష్ట్రాలను కోలుకొని విధంగా దెబ్బతీసింది.





Updated : 30 Sep 2023 3:13 AM GMT
Tags:    
Next Story
Share it
Top