కుతకుతలాడుతున్న అగ్రరాజ్యం...66 డిగ్రీల వేడిలో ఇరాన్
X
అమెరికాలోని ఈశాన్యం వర్షాలతో అల్లల్లాడుతుంటే...దక్షిణం, నైరుతిలు మాత్రం కుతకుతలాడుతున్నాయి. కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ వరకు ఎండలు మండిపోతున్నాయి. అక్కడి నగరాల్లో ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరుకుంటోంది. అక్కడ ఒక్క చోటే కాదు...ప్రపంచంలో చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.
లాస్, ఏంజిల్స్, వేగాస్, కాలిఫోర్నియా ్రాంతాల్లో వేడి చల్లార్చేందుకు అగ్ని మాపక దళాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. కాలిఫోర్నియా డెత్ వ్యాలీలో 128 ఫారెట్ హీట్ నమోదయింది. ఇది భూమి మీద అత్యధిక ఉష్ణోగ్రతలు కలిగిన ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఎల్ పాసో, టెక్సాస్ లలో 100.4...ఫీనిక్స్, ఆరిజోనాలలో 109.4 ఫారెన్ హీట్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడి జనాలు చెమటలలో తడిసిముద్దవుతున్నారు. సాధారణంగా ఎంత సమ్మర్ అయినా...ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ అమెరికాలో ఉండదు. లాస్ వేగాస్ లాంటి అత్యంత పాపులర్ ప్లేసెస్ లో కూడా జనాలు కనిపించడం లేదు. అక్కడ హోటళ్ళు, ఫౌంటెన్ల దగ్గర సెక్యూరిటీలు కాపలాకాస్తున్నారు. ఎవరినీ లోపలికి అనుమతించకుండా పర్యవేక్షిస్తున్నారు.
హీట్ డోమ్ కారణంగా ఇదంతా జరుగుతోందని అంటోంది అక్కడి వాతావరణశాఖ. ఏదైనా ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగినప్పుడు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వాతావరణం పీడనం ఎక్కువగా ఉంటే...ఆ వేడి ఎక్కడికీ విస్తరించలేక అక్కడే ఉండిపోతుంది. అదే సమయంలో ఎండలు కూడా ఎక్కువగా ఉంటే ఉష్ణోగ్రతలు రింత పెరుగుతాయి. ఇప్పుడు అమెరికాలో సరిగ్గా ఇదే పరిస్థితి నెలకొంది. వచ్చే వారం నాటికి ఈ హీట్ డోమ్ దక్షిణ అమెరికా అంతా కూడా విస్తరిస్తుందని చెబుతున్నారు. మరోవైపు కెనడాలో కార్చిచ్చు కారణంగా కూడా అమెరికాలో వేడిగాలులు వీస్తున్నాయి.
ఇక దక్షిణ ఐరోపాలో కూడా ఇదే వాతావరణం ఉంది. అక్కడ కూడా ఎండలు దంచికొడుతున్నాయి. ఇరాన్ లో కూడా రికార్డ్ స్థాయిలో టెంపరేచర్ నమోదయింది. అమెరికాకు చెందిన వాతావరణ నిపుణుడు కోలిన్ మెక్ కార్తీ తెలిపిన వివరాల ప్రకారం... ఇరాన్ విమానాశ్రయంలో మధ్యాహ్నం 12.30 సమయంలో టెంపరేచర్ 66.7 డిగ్రీల సెల్సియస్ చూపించిందని ట్విటర్ లో తెలిపారు . ఈ వేడిని భరించడం కష్టమని చెబుతున్నారు. పర్షియన్ గల్ఫ్ లోని చాలా వెచ్చని నీటిపై ప్రవహించే తేమతో కూడిన గాలి.. లోతట్టు ప్రాంతాల్లోని వేడిని తాకడంతో ఇరాన్ లో భయంకర ఉష్ణోగ్రతలకు కారణం.ఇలాంటి వేడి మానవులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తగినంత నీరు తీసుకోకపోతే చెమట, మూత్రం రూపంలో ఎక్కువ నీరు బయటకు వెళ్లి డీ హైడ్రేషన్ కు గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈస్థాయిలో వేడి ఉంటే... రక్తం చిక్కబడటం అనంతరం గడ్డకట్టే స్థాయికి చేరుకోవడం వంటివి జరుగుతాయని అంటున్నారట. ఫలితంగా గుండెపోటు పక్షవాతం కూడా రావొచ్చని వైద్యులు చెబుతున్నారు.
బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం జులై నెలలో 10 రోజులు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫ్లోరిడాలో అట్లాంటిక్ జలాలు 32.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తాకగా.. చైనాలోని శాన్ బో టౌన్ షిప్ లోనూ రికార్డు స్థాయిలో 52.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెరుగుతున్న కాలుష్యం, రోజు రోజుకీ అంతరించిపోతున్న అటవీ సంపద , మానవుల అలవాట్ల కారణంగా ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.