Home > అంతర్జాతీయం > మోదీ కాళ్లు మొక్కిన అమెరికన్ ఫేమస్ సింగర్

మోదీ కాళ్లు మొక్కిన అమెరికన్ ఫేమస్ సింగర్

మోదీ కాళ్లు మొక్కిన అమెరికన్ ఫేమస్ సింగర్
X

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగిసింది. మూడు రోజుల పాటు ఆయన యూఎస్‎లో పర్యటించారు. తొలిరోజు ఐక్యరాజ్యసమితిలో జరిగిన యోగా డేలో పాల్గొన్నారు మోదీ. ఆ తర్వాత రోజు ప్రెసిడెంట్ బైడెన్‎తో సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం అమెరికా కాంగ్రెస్‎లో ప్రసంగించారు. ఆ తర్వాత రోజు వివిధ కంపెనీల సీఈవోలు, వ్యాపారస్థులతో సమావేశమయ్యారు. ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగించారు.





మోడీకి అమెరికాలో ఘనస్వాగతం లభించింది. వెళ్లిన ప్రతిచోట ప్రధానిని కలిసేందుకు అమెరికన్లు పోటీ పడ్డారు. యూఎస్ ప్రముఖులు సైతం మోడీని కలిసేందుకు ఉత్సాహం చూపించడం గమనార్హం. తన పర్యటనలోమోదీకి అమెరికాలో మరో అరుదైన గౌరవం లభించింది. మన దేశ సంస్కృతి సంప్రదాయాలంటే ఫారెనర్స్ ఫిదా అవుతుంటారు. సమయం వచ్చినప్పుడు వాటిని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పుడు అలాంటి సీనే అమెరికాలో జరిగింది. అమెరికన్ ఫేమస్ సింగర్ మేరీ మిల్బెన్‌ భారత దేశ జాతీయ గీతాన్ని ఆలపించింది. భారతీయుల హృదయాలను దోచుకుంది. అమెరికా పర్యటన ముగింపు కార్యక్రమంలో మేరీ ‘జనగణమన' ఎంతో మధురంగా ఆలపించారు. ఆ తరువాత ప్రధాని కాళ్లను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.





గతంలో మిల్బెన్‌ ‘ఓం జై జగదీశ్‌ హరే’ పాట పాడి భారతీయులకు సుపరిచితురాలయ్యారు. తాజాగా జనగనమన పాడి భారతదేశం పట్ల తనకున్న గౌరవాన్ని చూపించారు. " భారత ప్రధాని మోదీ కోసం జాతీయ గీతాన్ని ఆలపించడం నాకుఎంతో ఎంతో గౌరవంగా ఉంది. ఈ దేశ ప్రజలు తమ కుటుంబంగా తనను పిలవడం ఆనందంగా ఉంది. నలుగురు అమెరికా అధ్యక్షుల కోసం అమెరికన్‌ దేశభక్తి గీతాన్ని పాడటం ఆనందంగా ఉంది. అమెరికన్‌, భారత గీతాలు రెండు కూడా ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు ఆదర్శం" అని మిల్బెన్ తెలిపారు.







Updated : 24 Jun 2023 12:49 PM IST
Tags:    
Next Story
Share it
Top