Home > అంతర్జాతీయం > ఇది గుమ్మడికాయ కాదు...ఏంటో తెలిస్తే షాక్

ఇది గుమ్మడికాయ కాదు...ఏంటో తెలిస్తే షాక్

ఇది గుమ్మడికాయ కాదు...ఏంటో తెలిస్తే షాక్
X

రైతే ఓ శాస్త్రవేత్త అని నిరూపిస్తున్నాడు బ్రిటన్‎కు చెందిన ఓ అన్నదాత. కష్టపడే మనస్తత్వం, సాధించాలనే తపన, పట్టుదలతో ప్రపంచంలోనే మరే రైతు సాధించని అరుదైన రికార్డును సృష్టించాడు. శాస్త్రవేత్తలు సైతం అబ్బురపడేలా సేద్యంలో అద్భుతమైన పంట దిగుబడిని సాధించాడు. మిగతా రైతులకు భిన్నంగా భారీ ఉల్లిగడ్డలను సాగు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. శాస్త్రవేత్తలను సైతం తలదన్నేలా 9 కిలోల ఉల్లిగడ్డను తన వ్యవసాయ భూమిలో పండించి సంచలనం సృష్టించాడు.

బ్రిటన్ గ్వెర్న్సే ప్రాంతానికి చెందిన రైతు గారెత్ గ్రిఫిన్ . ఈయన ఓ రైతు. తనకున్న వ్యవసాయ భూమిలో నిత్యం కూరగాయలు సాగు చేస్తుంటారు. 65ఏళ్ల వయసున్న గారెత్‎కు సేద్యంలో ప్రయోగాలు చేయడమంటే ఎంతో ఇష్టం. మిగతా రైతులకు భిన్నంగా వ్యవసాయంలో ఏదైనా సాధించాలని నిత్యం తపన పడుతుంటారు. అలా భారీ సైజు ఉల్లిగడ్డలను పండించాలనే ఎన్నో ఏళ్ల నుంచి తన వ్యవసాయ భూమిలో కృషి చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12ఏళ్లుగా పట్టువదలని విక్రమార్కుడిలా దాని కోసం ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు ఈ రైతు కృషి ఫలించింది. 9 కిలోల బరువున్న భారీ ఉల్లిగడ్డలను తన పొలంలో పండించి అరుదైన రికార్డును సృష్టించారు గెరెత్. ఈ రైతు సాగు చేసిన ఉల్లిగడ్డ ప్రపంచంలోనే అతి పెద్దది కావడంతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోనూ స్థానం దక్కించుకున్నారు గెరెత్.

ఇటీవల జరిగిన హరోగేట్ ఆటమ్ ఫ్లవర్ షోలో ఈ భారీ ఉల్లిగడ్డను ప్రదర్శించారు గెరెత్. ఇది వరల్డ్ రికార్డు అని హారోగేట్ ఫ్లవర్ షో సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో ఈ రైతు పేరు ప్రపంచవ్యాప్తంగా పాకిపోయింది. నిజంగా రైతు సృష్టి అద్భుతమని, భారీ ఉల్లిగడ్డపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఈ ఉల్లిగడ్డ 8.9 కిలోల బరువు, 21 అంగుళాల పొడవు ఉంది. పొరపాటున ఎవరైనే దీనిని చూస్తూ గుమ్మడి కాయ అని ఫిక్స్ అవుతారు. మరి ఇలాంటి అద్భుతాన్ని సృష్టించిన రైతు కృషికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.



Updated : 19 Sept 2023 6:28 PM IST
Tags:    
Next Story
Share it
Top