అట్లాంటిక్ సముద్రం మధ్యలో ఎగసిపడుతున్న మంటలు..
X
అట్లాంటిక్ మహా సముద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 2 వేల 857 కార్లతో వస్తున్న నెదర్లాండ్స్‌కు చెందిన ఓ కార్గో పడవలో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో పడవలోని కార్లనీ దగ్థమైనట్లు తెలుస్తోంది. మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
జర్మనీలోని బ్రెమెన్ పోర్టు నుంచి ఈజిప్టులోని మరో పోర్టుకు 2 వేల 857 కార్లతో ఫ్రెమాంటిల్ హైవే అనే నౌక బయల్దేరింది. అమేలాండ్ ద్వీపానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను ఆదుపుచేసేందుకు సిబ్బంది ప్రయత్నించిన ఫలితం రాలేదు. దీంతో వారు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో కొందరు సముద్రంలోకి దూకేశారు.
సమాచారం అందుకున్న డచ్ కోస్ట్ గార్డ్, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. నౌకలోని 23 మంది సిబ్బందితోపాటు సముద్రంలోకి దూకిన వారిని కాపాడారు. సిబ్బందిని రక్షించిన తర్వాత హెలికాప్టర్లు బోట్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నించారు. అయినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో పడవలోని సుమారు 3 వేల కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. భారీ నౌక మునగకుండా ఉండేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సిబ్బందిలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఇటీవల కాలంలో సంద్రంలో పడవ ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండు రోజుల కిందట ఇండోనేషియాలో అర్ధరాత్రి సమయంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. సులవేసి ద్వీపంలో పడవ మునిగి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది గల్లంతయ్యారు. పది రోజుల కిందట గ్రీస్ లో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 78 మంది చనిపోయారు.