నైట్రోజన్ గ్యాస్‌తో తొలి మరణ శిక్ష..ప్రపంచంలోనే తొలిసారి అమలు
X
మరణ శిక్ష అనేది అతి పెద్ద నేరం చేసిన వారికి మాత్రమే విధించే శిక్ష అని అందరికీ తెలుసు. ఇటువంటి మరణశిక్షను చాలా దేశాలు రకరకాలు అమలు చేస్తూ ఉంటాయి. అందులో అమెరికా కొత్త తరహా మరణశిక్షను అమలు చేస్తూ ఉంటుంది. తాజాగా ఆ దేశం మరణశిక్ష విధించడంలో కొత్త రికార్డును నెలకొల్పింది. అమెరికా చరిత్రలో తొలిసారి నైట్రోజన్ గ్యాస్ వాడి ఊపిరాడకుండా చేసి ఓ వ్యక్తికి మరణశిక్షను అమలు చేశారు. అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఓ హత్య కేసులో దోషిగా తేలిన కెన్నెత్ యూజెన్ స్మిత్‌కు ఈ శిక్షను అమలు చేశారు. 58 ఏళ్ల ఆ వ్యక్తి ఊపిరితిత్తుల్లోకి ఫేస్ మాస్క్ ద్వారా స్వచ్ఛమైన నైట్రోజన్‌ను పంపి మరణశిక్షను అమలు చేశారు. నిన్నటి రాత్రి 8.25 గంటలకు అలబామా జైలులో స్మిత్ మరణించినట్లుగా అలబామా అధికారులు వెల్లడించారు. నైట్రోజన్ గ్యాస్‌తో మరణశిక్షను అమలు చేసే విధానంపై ఇప్పటికే అమెరికాలో వివాదం నడుస్తోంది. ఆ శిక్ష పూర్తి మానవీయతతో కూడిన శిక్ష అని అలబామా ప్రభుత్వ గట్టిగా వాదిస్తోంది.
నైట్రోజన్ గ్యాస్‌తో మరణశిక్ష విధించడాన్ని క్రూరమైన చర్యగా ప్రజలు విమర్శిస్తున్నారు. అలా నైట్రోజన్ గ్యాస్ ద్వారా మనిషిని చంపడం దారుణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఆ వ్యక్తికి విషపు ఇంజెక్షన్‌తో మరణశిక్షను అమలు చేయాలని అమెరికా ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే నిందితుడు కెన్నెత్ యూజెన్ స్మిత్ ఐవీ లైన్ కనెక్ట్ కాకపోవడంతో ఆ శిక్షను ఆఖరి నిమిషంలో అమెరికా సర్కార్ రద్దు చేసింది. ఆ తర్వాత అమెరికాలోని సుప్రీం కోర్టు జోక్యంతో నిందితుడికి ప్రభుత్వం మరణశిక్షను అమలు చేసింది. దీనిపై అలబామా ప్రాంతంలోని కొన్నిచోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.