Home > అంతర్జాతీయం > Bitcoin shares : రెండేళ్లలో తొలిసారి.. బిట్‌కాయిన్ షేర్స్ భారీగా పెరుగుదల

Bitcoin shares : రెండేళ్లలో తొలిసారి.. బిట్‌కాయిన్ షేర్స్ భారీగా పెరుగుదల

Bitcoin shares  : రెండేళ్లలో తొలిసారి.. బిట్‌కాయిన్ షేర్స్ భారీగా పెరుగుదల
X

రెండేళ్ల తర్వాత క్రిప్టోకరెన్సీ జోరందుకుంది. బిట్‌కాయిన్ షేర్లు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. రెండేళ్లలో తొలిసారిగా 50 వేల డాలర్ల మార్క్‌ను బిట్‌కాయిన్ తాకింది. ఈ ఏడాది చివరలో వడ్డీ రేట్టు బాగా తగ్గిపోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అ తరుణంలో క్రిప్టోకరెన్సీ షేర్లను కొనేవారి సంఖ్య బాగా పెరిగింది. మరోవైపు బిట్‌కాయిన్ ధరను ట్రాక్ చేయడానికి యూఎస్ నియంత్రణ సంస్థ నుంచి గ్రీన్‌సిగ్నల్ కూడా లభించింది. దీంతో బిట్‌కాయిన్ కొనాలనుకునేవారికి ఇదొక శుభవార్త అని చెప్పాలి.

ఇకపోతే ఈ ఏడాదిలో ఇప్పటివరకూ సుమారుగా 16.3 శాతం బిట్‌కాయిన్ విలువ పెరిగింది. 2021 డిసెంబర్ తర్వాత తొలిసారి ఇప్పుడు అత్యధిక స్థాయిలో 50,196 డాలర్ల మార్క్‌ను చేరుకుంది. గత నెలలో ఈటీఎఫ్ స్పాట్ ప్రారంభించిన తర్వాత బిట్‌కాయిన్ 50 వేల డాలర్ల మైలురాయిని తాకడం ఎంతో ఆనందించదగ్గ పరిణామం అని క్రిప్టో లెండింగ్ సంస్థ నెగ్జో సహ వ్యవస్థాపకుడు ఆంటోని ట్రెంచెవ్ తెలిపారు. దీనివల్ల 20 శాతం విక్రయాల జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.

బిట్‌కాయిన్‌తో పాటుగా మరిన్ని క్రిప్టో కరెన్సీలు కూడా భారీగా లాభాలను సాధించాయి. రెండో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన ఈథర్ విలువ కూడా 4.08 శాతం పెరిగింది. దీంతో దాని విలువ 2,606.60 డాలర్లకు చేరుకుంది. ఇకపోతే కాయిన్‌బేస్ 4.86 శాతం, రియోట్ ప్లాట్‌ఫారమ్ 11.9 శాతం, మారథాన్ డిజిటల్ 13.7 శాతం చొప్పున లాభాలను పొందాయి. బిట్‌కాయిన్ షేర్లను భారీ సంఖ్యలో కొనుగోలు చేసిన మైక్రోస్ట్రాటజీ కంపెనీ షేర్లు కూడా 11.7 శాతం లాభాలను సాధించాయి.


Updated : 13 Feb 2024 7:40 AM IST
Tags:    
Next Story
Share it
Top