Home > అంతర్జాతీయం > ఆ క్రికెటర్‎కు అరుదైన వ్యాధి..సెంచరీ కొట్టలేనని భావోద్వేగం

ఆ క్రికెటర్‎కు అరుదైన వ్యాధి..సెంచరీ కొట్టలేనని భావోద్వేగం

ఆ క్రికెటర్‎కు అరుదైన వ్యాధి..సెంచరీ కొట్టలేనని భావోద్వేగం
X

ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్ అలన్ బోర్డర్ పార్కిన్సన్స్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. క్రికెట్ చరిత్రలోనే 11,000 టెస్ట్ పరుగులు చేసిన మొదటి ఆటగాడైన బోర్డర్‎కు 2016లో వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అయితే దానిని ఏడేళ్ల తరువాత ఇప్పుడు రివీల్ చేశారు. తనపై ఎవరూ జాలి చూపకూడదనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదన్నారు. ప్రస్తుతం బోర్డర్ వయసు 68. ఈ వ్యాధి కారణంగా సెంచరీ కొట్టలేనని , 80 ఏళ్లు బతికితే అది ఓ అద్భుతం అని చెప్పి భావోద్వేగానికి గురయ్యారు. క్రికెట్ లవర్స్‎కు బ్యాడ్ న్యూస్ చెప్పారు.

పార్కిన్సన్స్ అనేది ఓ అరుదైన వ్యాధి. దీని ప్రభావం నాడీ వ్యవస్థపై అధికంగా ఉంటుంది. శరీర కదలికలు సాధారణంగా లేకపోవడమే ఈ వ్యాధి లక్షణాలు. " క్రికెట్ రంగంలో సెంచరీలు, హాఫ్ సెంచరీలు చేసి దుమ్ముదులిపిన తాను ఈ వ్యాధితో బాధపడుతున్నానని తెలిస్తే ప్రజలు ఎలా స్పందిస్తారో తెలియదు. బాధపడతారో లేదా ఓదారుస్తారో చెప్పలేం. అందుకే ఈ విషయాన్ని ఇంత కాలం దాచిపెట్టాను. ఎప్పటికైనా తెలిసేదే కదా అని ఇప్పుడు చెబుతున్నాను. నేను 80 ఏళ్లు బతికుంటే మహా అద్భుతం. నేను మరో సెంచరీని సాధించలేను అనేది స్పష్టంగా చెప్పగలను"అని బోర్డర్ తన వ్యాధి గురించి తెలిపి ఆవేదన వ్యక్తం చేశారు.

273 వన్డేలను ఆడిన బోర్డర్ 6524 పరుగులు, రెండు ఫార్మాట్‌లలో కలిపి 30 సెంచరీలు, 99 హాఫ్ సెంచరీలు సాధించారు. అంతే కాదు బోర్డర్ నాయకత్వంలోనే ఆ్రస్టేలియా 1987లో మొదటిసారిగా వన్డే వరల్డ్‌కప్‌ను గెలుచుకుంది. క్రికెట్ చరిత్రలో 11,000 టెస్ట్ పరుగులు చేసిన మొదటి ఆటగాడుగా గుర్తింపు సంపాదించుకున్నారు బోర్డర్‎.





Updated : 1 July 2023 3:59 AM GMT
Tags:    
Next Story
Share it
Top