Home > అంతర్జాతీయం > చావులోనూ కలిసి ప్రయాణం.. మాజీ ప్రధాని దంపతుల కారుణ్య మరణం

చావులోనూ కలిసి ప్రయాణం.. మాజీ ప్రధాని దంపతుల కారుణ్య మరణం

చావులోనూ కలిసి ప్రయాణం.. మాజీ ప్రధాని దంపతుల కారుణ్య మరణం
X

ప్రేమికుల రోజుకు కొద్ది రోజుల ముందు నెదర్లాండ్స్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ ప్రధాని డ్రైస్‌ వాన్‌ ఆగ్ట్‌, ఆయన సతీమణి యూజీనీ ఇద్దరూ ఒకేసారి మృత్యుఒడిలోకి చేరారు. చేతిలో చేయి వేసి.. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ప్రాణాలు విడిచారు. 93 ఏళ్ల వయసున్న వీరు అక్కడి చట్టం ప్రకారం వీరిద్దరూ కారుణ్య మరణం ద్వారా తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. దీంతో వీరి మధ్య 70 ఏళ్ల ప్రేమ బంధానికి తెరపడింది.

నెదర్లాండ్స్‌ మాజీ ప్రధాని డ్రైస్‌ వాన్‌ అగ్డ్‌ (93) ఆయన భార్య యూజినీ (93) కారుణ్య మరణంతో ఈ లోకాన్ని విడిచారు.‘1977 నుంచి 1982 వరకూ ప్రధానిగా సేవలందించిన వాన్‌ ఆగ్ట్‌ 93వ పుట్టినరోజు జరుపుకొన్న మూడు రోజుల తర్వాత స్వగ్రామమైన నిజ్‌మెగెన్‌లో తన ప్రియమైన భార్య యూజీనీ చేతిలో చేయి వేసి, ఆమెతో పాటే మరణించారు’ అని ఆయన స్థాపించిన హక్కుల సంస్థ ‘వాన్‌ ఆగ్ట్స్‌ క్లబ్‌’ ప్రకటించింది. 2019లో బ్రెయిన్‌ హేమరేజ్‌ బారిన పడిన వాన్‌ ఆగ్ట్‌ ఆ తర్వాత పూర్తిగా కోలుకోలేకపోయారు. యూజినీ కూడా అనారోగ్యానికి గురయ్యారు. ఒకరిని విడిచి మరొకరు జీవించలేమని నిర్ణయించుకున్న తర్వాత వారు కారుణ్య మరణాన్ని ఎంచుకున్నారు.

కాగా, 2002లో నెదర్లాండ్స్‌లో కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేసిన తర్వాత అక్కడ ఇలాంటి కేసులు నాలుగు రెట్లు పెరిగాయి. 2022లోనే 8,720 మంది దీన్ని ఎంపిక చేసుకున్నారు. ఆ ఏడాది 26 జంటలు కోరుకుంటే 2023లో ఇది 58 జంటలకు పెరిగింది.

Updated : 15 Feb 2024 1:32 PM IST
Tags:    
Next Story
Share it
Top