హార్ట్ ఎటాక్తో చనిపోయిన స్టార్ రెజ్లర్ బ్రే వ్యాట్
X
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్ మెంట్ లో తీవ్ర విషాదం నెలకొంది. స్టార్ రెజ్లర్ బ్రే వ్యాట్ కన్నుమూశాడు. ఆయన వయసు 36 సంవత్సరాలు. గతకొంత కాలంగా గుండె సమస్యలతో బాధపడుతున్న వ్యాట్.. గురువారం రాత్రి హార్ట్ ఎటాక్ రావడంతో చనిపోయాడు. ఈ విషయాన్ని డబ్ల్యూడబ్ల్యూఈ సీఈవో ట్రిపుల్ హెచ్ ధృవీకరించాడు. ఆయన అకాల మరణం పట్ల కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.
"డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమర్ మైక్ రొటుండా నుంచి ఇప్పుడే కాల్ వచ్చింది. డబ్ల్యూడబ్ల్యూఈ కుటుంబ సభ్యుడైన విండామ్ రొటుండా అలియాస్ బ్రే వ్యాట్ అకాల మరణం చెందినట్లు ఆయన చెప్పారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఈ సమయంలో ఆ కుటుంబానికి కావాల్సిన ప్రైవసీ ఇవ్వండి" అని ట్రిపుల్ హెచ్ ట్వీట్ చేశాడు.
బ్రే వ్యాట్ అసలు పేరు విండామ్ రొటుండా. వ్యాట్ 2009లో ప్రొఫెషనల్ రెజ్లర్గా మారాడు. ఈ మధ్య కాలంలో బ్రే వ్యాట్ డబ్ల్యూడబ్ల్యూఈలో కనిపించడం లేదు. ప్రముఖ రెజ్లర్ అండర్‌టేకర్ వచ్చేటప్పుడు లైట్లు ఆపినట్లేబ్రే వ్యాట్ వచ్చే సమయంలోనూ చేసేవారు. అతను ఓ లాంతరు పట్టుకొని ఎంట్రీ ఇచ్చేవాడు. అంతేకాదు డిఫరెంట్ క్యారెక్టర్లతోనూ బ్రే వ్యాట్ అలరించేవాడు. రింగులో తన రెజ్లింగ్ స్కిల్స్తో పాటు అతను చేసే విన్యాసాలు పిల్లలను బాగా ఆకట్టుకునేవి. బ్రే వ్యాట్ చివరిసారి 2023 రాయల్ రంబుల్ రెజ్లింగ్ ఈవెంట్లో కనిపించాడు. వ్యాట్ తన కెరీర్‌లో ఒక డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ షిప్, రెండు యూనివర్సల్ ఛాంపియన్‌షిప్ టైటిల్స్ సాధించాడు.