Home > అంతర్జాతీయం > అధ్యక్షుడా మజాకా.. ఎత్తిన బీర్ దించకుండా తాగేశాడు

అధ్యక్షుడా మజాకా.. ఎత్తిన బీర్ దించకుండా తాగేశాడు

అధ్యక్షుడా మజాకా.. ఎత్తిన బీర్ దించకుండా తాగేశాడు
X

మనవాళ్లు క్రికెట్ ను ఎంత అభిమానిస్తారో.. ఫ్రాన్స్ వాళ్లు కూడా రగ్బీని అంతే ఇష్టపడతారు. ప్రతి ఏటా ఫ్రాన్స్ లో రగ్బీ టోర్నమెంట్ లు నిర్వహిస్తారు. ఈ ఏడాది నిర్వహించిన స్టేట్ డి ఫ్రాన్స్ టోర్నీలో ఈసారి టౌలౌస్ రగ్గీ టీం విజేతగా నిలిచింది. ఏ జట్టు ట్రోఫీ గెలిచినా డ్రెస్సింగ్ రూంలో షాంపేన్ ఏరులై పారుతుంది. ఈ టోర్నీలో గెలిచిన టౌలౌస్ టీం కూడా డ్రెస్సింగ్ రూంలో సంబరాలు చేసుకుంది. ఈ సంబరాల్లో ఓ స్పెషల్ వ్యక్తి హాజరయ్యారు. ఆయన ఎవరో కాదు.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్.




టౌలౌస్ వీరాభిమాని అయిన మేక్రాన్.. జట్టుతో పాటు డ్రెస్సింగ్ రూంలో సంబరాలు చేసుకున్నాడు. వాళ్లతో ఆనందంగా గడిపాడు. ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఓ బీరు సీసాను ఎత్తి కేవలం పదిహేను సెకన్లలో ఖాళీ చేశాడు. అది కూడా ఎత్తిన సీసా దించకుండా. అంతవరకు బాగానే ఉంది. కానీ, దేశ అధ్యక్షుడు పబ్లిక్ గా మద్యం తాగడంపై విమర్శలు వస్తున్నాయి. దేశ అధ్యక్షుడై ఉండి మద్యాన్ని ప్రోత్సహించడం ఏంటని మండిపడుతున్నారు.






Updated : 20 Jun 2023 10:28 PM IST
Tags:    
Next Story
Share it
Top