Home > అంతర్జాతీయం > Gabriel Attal : ఫ్రాన్స్ ప్రధానిగా గాబ్రియేల్ అట్టల్.. తొలి గే పీఎంగా రికార్డ్

Gabriel Attal : ఫ్రాన్స్ ప్రధానిగా గాబ్రియేల్ అట్టల్.. తొలి గే పీఎంగా రికార్డ్

Gabriel Attal  : ఫ్రాన్స్ ప్రధానిగా గాబ్రియేల్ అట్టల్.. తొలి గే పీఎంగా రికార్డ్
X

ఫ్రాన్స్‌ ప్రధానిగా గాబ్రియేల్ అట్టల్ నియమితులయ్యారు. రాజకీయ కారణాలతో ప్రధాని ఎలిజెబెత్ బోర్న్ రాజీనామా చేయగా.. ఆమె స్థానంలో గాబ్రియేల్ను నియమిస్తూ అధ్యక్షుడు మెక్రాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 34 ఏళ్ల గాబ్రియేల్ ఫ్రాన్స్ అతి చిన్న ప్రధానిగా చరిత్ర సృష్టించారు. అదేవిధంగా తొలి గే ప్రధానిగానూ ఆయన రికార్డు నమోదు చేశారు. కరోనా సమయంలో గాబ్రియేల్ పేరు ఆ దేశంలో బాగా వినిపించింది. ఇటీవల నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఎక్కువ ప్రజాదరణ కలిగిన మంత్రుల్లో ఒకరిగా నిలిచారు. మాక్రాన్కు గాబ్రియేల్ సన్నిహితుడు.

ఇటీవల తీసుకొచ్చిన ఇమిగ్రేషన్ చట్టంపై ఫ్రాన్స్లో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే సోమవారం బోర్న్ రాజీనామా చేయగా.. వెంటనే మాక్రాన్ దానికి ఆమోదం తెలిపారు. కొత్త చట్టం ప్రకారం.. విదేశీయులను వెనక్కి పంపేందుకు ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు వస్తాయి. ఈ ఏడాది చివరిలో యూరిపియన్ యూనియన్ ఎన్నికలు జరగనుండగా.. గాబ్రియేల్ ఎంపిక ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ఎలిజెబెత్ బోర్న్ 2022లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఫ్రాన్స్ పీఎం పదవి చేపట్టిన రెండో మహిళగా ఆమె నిలిచారు.

Updated : 10 Jan 2024 7:28 AM IST
Tags:    
Next Story
Share it
Top