Home > అంతర్జాతీయం > హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో అదానీ గ్రూప్‌కు భారీ నష్టం.. దాదాపు 4 లక్షల కోట్లు

హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో అదానీ గ్రూప్‌కు భారీ నష్టం.. దాదాపు 4 లక్షల కోట్లు

హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో అదానీ గ్రూప్‌కు భారీ నష్టం.. దాదాపు 4 లక్షల కోట్లు
X

అదానీ గ్రూప్‌లో తీవ్రమైన ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ సంస్థ చేసిన ఆరోపణలు.. ఆ సంస్థ ఆర్థిక సంపదపైన తీవ్ర ప్రభావం చూపింది. హిండెన్ బర్గ్ రిపోర్డ్‌తో అదానీ గ్రూపు నష్టాల పాలైంది. అయితే పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి ఆ సంస్థ చేయని పనులు లేవు. వేలాది కోట్ల రుణాలను సైతం తిరిగి చెల్లించడంతో ప్రస్తుతం నిధుల కొరతతో ఇబ్బంది పడుతోంది.

జనవరిలో ఈ నివేదిక విడుదల కాగా.. గత 6 నెలల్లో(జనవరి నుండి జూన్ వరకు) దాదాపు 4 లక్షల కోట్లకు పైగా సంపదను అదానీ గ్రూపు కోల్పోయినట్లు.. ఆదివారం ఓ నివేదికలో బ్లూమ్ బెర్గ్ నివేదించింది. అదానీ గ్రూప్ అకౌంటింగ్ మోసం మరియు స్టాక్ మానిప్యులేషన్‌కు పాల్పడిందని ఆరోపించిన US షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కారణంగా ఈ నష్టం జరిగిందని తెలిపింది. ఈ కారణంగా జనవరి 27న ఇప్పటి వరకు ఏ బిలియనీర్ ఓ రోజులో చూడని అతిపెద్ద నష్టాన్ని కంపెనీ నమోదు చేసిందని స్పష్టం చేసింది. ఏకంగా 20.8 బిలియన్ డాలర్ల(రూ.17,19,41,12,00,000)మేర సంపద కోల్పోయినట్లు పేర్కొంది.

కాగా.. హిండెన్ బర్గ్ ఆరోపణలను అదానీ గ్రుపు అప్పుడే ఖండించింది. అనంతరం ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టు ఓ నిపుణుల కమిటీని సైతం నియమించింది. అయితే అవన్నీ ఆరోపణలేనని, ఇప్పటి వరకు ఎనలైజ్ చేసిన సమాచారాన్ని బట్టి చూస్తే ఎటువంటి నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఆధారాలు లభించలేదని ఆ ప్యానెల్ ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. జూన్ 27న అదానీ ఫ్లాగ్‌షిప్ సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ వార్షిక నివేదికలో సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్ నివేదికను ప్రస్తావించారు. తమ సంస్థల నుంచి ఎటువంటి వైఫల్యాలు లేవని అందులో పేర్కొంది. తమ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి, అపఖ్యాతి పాలు చేయడానికే ఉద్దేశపూర్వకంగా బురద చల్లారని వెల్లడించింది.



Updated : 10 July 2023 9:04 AM IST
Tags:    
Next Story
Share it
Top