Home > అంతర్జాతీయం > US Hikes Visa Fees:అమెరికా వెళ్లే భారతీయులకు బ్యాడ్​న్యూస్​... వీసా ఇక మరింత భారం

US Hikes Visa Fees:అమెరికా వెళ్లే భారతీయులకు బ్యాడ్​న్యూస్​... వీసా ఇక మరింత భారం

US Hikes Visa Fees:అమెరికా వెళ్లే భారతీయులకు బ్యాడ్​న్యూస్​... వీసా ఇక మరింత భారం
X

"హెచ్‌-1 బీ వీసా వస్తే చాలు .. హ్యాపీగా అమెరికా వెళ్లిపోవచ్చు.. అక్కడే ఏదో ఉద్యోగం చూసుకొని సెటిలై పోవొచ్చు" అని ఎంతోమంది ఆశపడుతుంటారు. ఆ ఆశలపై నీళ్లు చల్లేలా.. అగ్రరాజ్యం అమెరికా మన భారతీయులకు ఓ షాకిచ్చింది. హెచ్‌-1బీ వీసాతో పాటు కొన్ని కేటగిరీల దరఖాస్తు ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన రుసుములు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. వీసాల అప్లికేషన్‌ ఫీజులను పెంచడం 2016 తర్వాత ఇదే మొదటిసారి అని బైడెన్‌ ప్రభుత్వం వెల్లడించింది.

హెచ్‌-1బీ వీసా: దరఖాస్తు ధర 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెరిగింది.(38 వేల నుంచి 64700 కు పెంచారు)

హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్ రుసుము 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెంచారు.(800 నుంచి 17,800ల‌కు పెంచారు)

ఎల్‌-1 వీసా దరఖాస్తు రుసుము 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకు పెంచారు.(38 వేల నుంచి 1,15000)

ఈబీ-5 వీసాల అప్లికేషన్‌ ఫీజులను 3,675 డాలర్ల నుంచి ఏకంగా 11,160 డాలర్లకు పెంచారు.(3ల‌క్ష‌ల 4 వేల నుంచి 9 ల‌క్ష‌లు)

మార్చి 6వ తేదీ నుంచి అమెరికా వీసా హెచ్‌-1బీ వీసాల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభంకానుంది. వీసా కోరుకునే అభ్య‌ర్థులు తొలుత‌ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేష‌న్ చేసుకునేందుకు ఒక ఫీజును నిర్ణ‌యించారు. ఇది .. గ‌తం క‌న్నా వంద రెట్లు ఎక్కువ‌గా నిర్ణ‌యించారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. వీసా ద‌ర‌ఖాస్తు పూర్తి చేసి స‌బ్మిట్ చేయాలి. దీనికి కూడా అసాధార‌ణంగా ఫీజులు పెంచేశారు. పైగా.. ఎవ‌రు ఎన్ని ద‌ర‌ఖాస్తులు పెట్టినప్ప‌టికీ ఒక‌టే ద‌ర‌ఖాస్తుగా ప‌రిగ‌ణించ‌నున్నారు. మొత్తంగా ఈ ధ‌ర‌ల పెంపుద‌ల ఇప్పుడు అభ్య‌ర్థుల‌ను తొలి ద‌శ‌లోనే నిలువ‌రించేసేట్టుగా ఉంద‌ని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. హెచ్‌-1బీ వీసాలు కోరుకునే మ‌ధ్య త‌ర‌గ‌తి యువత.. అమెరికా వెళ్లాలంటే అప్పులైనా చేయాలి. లేకుంటే ఆశ‌లైనా వ‌దులుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.


Updated : 2 Feb 2024 4:04 PM GMT
Tags:    
Next Story
Share it
Top