ఏదో ఒక రోజు.. అమెరికాను గతంగా మిగుల్చుతాం: హమాస్ వార్నింగ్
X
అమెరికాకు హమాస్ నేత అలీ బరాకా డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు. ప్రపంచంలో తాము అగ్రరాజ్యంగా అని భావిస్తున్న అమెరికా ఏదో ఒక రోజు గతంగా మిగిలిపోతుందని, పూర్వ రష్యాలాగా పతనం అవుతుందని హెచ్చరించాడు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో స్పందించిన అలీ.. నవంబర్ 2న ఓ లెబనీస్ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అమెరికా శత్రువులందరూ చర్చలు జరుపి ఒక్కటవుతున్నారని, అంతా కలిసి ఉమ్మడిగా యుద్ధంలో పాల్గొనే రోజు దగ్గర్లోనే ఉండొచ్చని తీవ్రంగా హెచ్చరించాడు. బ్రిటన్, గ్లోబల్ ఫ్రీమాసన్రీ (అంతా ఒక్కటే అని అర్థం) వల్ల ఏర్పడిన అమెరికా.. తప్పకుండా కూలిపోతుందని పేర్కొన్నాడు.
రానున్న రోజుల్లో అమెరికా అగ్ర రాజ్యంగా, శక్తివంతమైన దేశంగా ఉండబోదని చెప్పుకొచ్చాడు. అమెరికాపై దాడి చేయగల సామర్థ్యం ఉన్న ఉత్తర కొరియాను ప్రశంసించాడు అలీ బరాకా. అమెరికాను ఎదిరించగల, తిప్పికొట్టగల సమర్థవంతుడు కిమ్ జాంగ్ ఉన్ అని మెచ్చుకున్నాడు. ఎవరైనా తమపై దాడి చేస్తే.. మద్దతుగా ఉత్తర కొరియా రావొచ్చని.. తమ కూటమిలో ఆ దేశానికి కూడా భాగస్వామ్యం ఉందని అన్నాడు. హమాస్ ప్రతినిధి బృందం ఇటీవలే మాస్కోకు వెళ్లిందని, మరో బృందం బీజింగ్‌కు కూడా వెళ్తుందని హమాస్ అధికారులు చెప్పుకొచ్చారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.