Home > అంతర్జాతీయం > పొగ కమ్ముకోవడంతో ఊహించని ప్రమాదం..

పొగ కమ్ముకోవడంతో ఊహించని ప్రమాదం..

పొగ కమ్ముకోవడంతో ఊహించని ప్రమాదం..
X

మంటలు ఆర్పేందుకు వెళ్లిన రెండు హెలిక్యాప్టర్లు.. అదే మంటలకు ఆహుతయ్యాయి. రెండు హెలిక్యాప్టర్లు పరస్పరం ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కాలిఫోర్నియాలోని కాబాజోన్ ప్రాంతంలో ఆదివారం (ఆగస్టు 6) కార్చిచ్చు అంటుకుంది. వాటిని ఆర్పేందుకు రక్షణ, అగ్నిమాపక విభాగం రెండు హెలిక్యాప్టర్లను రంగంలోకి దింపి.. మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేసింది. అయితే, కార్చిచ్చు వల్ల దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఏమీ కనిపించక రెండు హెలిక్యాప్టర్లు ఒకదానికి ఒకటి గుద్దుకుని పేలిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎమర్జెన్సీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కాగా, ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి వివరాలు తెలియజేస్తామని అగ్నిమాపక సిబ్బంది తెలిపింది.

Updated : 7 Aug 2023 3:06 PM IST
Tags:    
Next Story
Share it
Top